తమిళ నాడు ముఖ్యమంత్రి, అమ్మ జయ లలిత మరో సారి రాజీవ్ హంతకులపై దయ చూపించారు. ఇప్పటికే రాజీవ్ హంతకులను విడుదల చేయాలంటూ కాంగ్రెస్ హయంలో ని ప్రభుత్వానికి లేఖ రాసిన జయ సర్కార్ మరో సారి మోది ప్రభుత్వానికి లేఖ రాసారు. దీనితో తమిళనాడు ప్రభుత్వం రాజీవ్ హంతకులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ హత్యా కేసులో దోషులుగా తేలిన ఏడుగురు ఎల్టిటియి ఉగ్రవాదులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే.

24 సంవత్సరాలుగా జైలులోనే మగ్గుతున్నారంటూ గతం లోనే జయ సర్కార్ వాళ్ళని విడుదల చేయంచడానికి ప్రయత్నించింది. అయితే అప్పుడు అధికారంలో ఉన్న మన్మోహన్ సర్కార్ జయలలిత ప్రభుత్వానికి చెక్ పెట్టింది.ప్రస్తుతం కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం, బిజెపి అధికారాన్ని చేజిక్కించుకోవడం తో జయలలిత సర్కార్ మరో సరి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్ “24 ఏళ్ళగా జైల్లోనే మగ్గిపోతున్న రాజీవ్ హంతకులను విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాం. దీనిపై మీరేమంటారు?” అని కేంద్ర హోం శక కార్యదర్శి రాజీవ్ మేహరికి లేఖ రాశారు. దినిపై కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేకున్నా త్వరలోనే స్పందించే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: