తమ అకౌంట్లను తొలగిస్తున్నారని సోషల్ నెట్ వర్కింగ్ కంపెనిలైన పేస్ బుక్, గూగుల్ లను హ్యాక్ చేసి వాటి సీఈఓ లను చంపుతామని ప్రపంచ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కొద్దిరోజుల క్రిందట ప్రకటించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం “గూగుల్”ని హ్యాక్ చేయాలనుకున్న ఐఎస్ఐఎస్ పొరపాటున ఒక భారతీయ సాంకేతిక సంస్థను హ్యాక్ చేసింది. ఐఎస్ఐఎస్ కు అనుభంద సంస్థ గా ఉన్న సైబర్ ఖలిఫారాజ్య సైన్యం (సీసీఏ) www.addgoogleonline.com అనే ఒక భారతీయ వెబ్ సైట్ ను హ్యాక్ చేసింది.


గందని.కే అనే వ్యక్తి “ఆల్వేస్ సే” అనే భారతీయ టెక్ సంస్థ కోసం దిన్ని నమోదు చేసారు. ఈ సంస్థ స్థానిక క్లయింట్లకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సేవలను ఈ సమస్థ అందిస్తుంటుంది. అంతకుముందే గూగుల్ ని హ్యాక్ చేస్తామని టెలిగ్రామ్ అనే మెస్సేజింగ్ యాప్ లో సీసిఏ ప్రకటించినట్లు వోకేటివ్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ పేర్కుంది. హ్యాకింగ్ జరిగిన తరువాత “గూగుల్ ని హ్యాక్ చేస్తామని చెప్పాం. అల్లా దయవల్ల అది ఈ రోజే నెరవేరునట్లు ప్రయత్నిస్తాం” అని సీసిఏ ప్రకటించింది.


అయితే గూగుల్ అనుకుని యాడ్ గూగుల్ అనే ఆన్ లైన్ సంస్థని సీసిఏ హ్యాక్ చేసిందని, సిలికాన్ వ్యాలి కేంద్రం గా పనిచేసే గూగుల్ తో దానికి ఎటువంటి సంబంధం లేదని “వోకేటివ్ వెబ్ సైట్” కొన్నిగంటలు తరువాత ప్రకటించింది. హ్యాకింగ్ తరువాత ఫ్రెంచ్ లో ఐఎస్ఐఎస్ గేయాన్ని, అధికారక చిహ్నాన్ని తొలగించి ఆ స్థానంలో “సీసిఏ హ్యాక్ చేసింది.” అనే సందేశాన్ని ఉగ్రవాద సంస్థ ఉంచింది. ఆ తరువాత n3far1rous అనే హ్యాకర్ బృందం ఉగ్రవాద సంస్థ సందేశాన్ని తొలగించి “ఐఎస్ఐఎస్...ఇది తిను” అనే వ్యంగ్య సందేశాన్ని పెట్టింది. దీనితో పాటు బ్రిటన్ రాక్ సంగీతాన్ని కూడా కొద్ది సేపు వినిపించింది. బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం సీసిఏ ఇప్పటి వరకు 35 బ్రిటిష్ వెబ్ సైట్లను హ్యాక్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: