ప్రస్తుతం మన దేశంలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. మన దేశంలో జరిగే అక్రామాలకు అడ్డుకట్ట వేసే చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలున్నాయో అన్ని లోపాలుకుడా ఉన్నాయి. మరి ఆ చిన్న లోపాల్ని వాడుకొని చట్టం కళ్ళు గప్పి ఎన్నో అక్రమాలకు  పాల్పడుతున్నారు కొందరు. చట్టాలలో లోపాలు, అధికారుల అలసత్వం, తనఖీ అధికారుల అవినీతి, ప్రభుత్వ నిర్లక్ష్యం ఇవన్నీ కలగలిపి దేశాన్ని నట్టేటా ముంచేస్తున్నాయి. మనదేశంలో ప్రస్తుతం కల్తీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కేవలం చట్టాలలో ఉన్న లోపాలనే సరిదిద్దినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం అవ్వదు.

 

లకల్తీ రక్కసిని రూపుమాపాలంటే అందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోపాలు ఉన్న చట్టాలను సవరించాడంతో పాటు, పతిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దేశంలోని ప్రతి విభాగంతో అధికారులను సమన్వయం చేయాలి. కొత్త కంపెనీల ఉత్పత్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మార్కెట్ లోకి విడుదల చేయాలి. నిందితులను కఠిన శిక్షలు వేయించగలిగినపుడే ఈ రుగ్మతకు పుల్‌స్టాప్ పడుతుంది. ఆహారపదార్థాల కల్తీ ఒక్క రాష్ట్రం లేదా దేశానికి సంబంధించిన సమస్య కాదు.

 

ప్రపంచమంతా ఒక వ్యవస్థగా విస్తరించి ఉంది. కల్తీ ఆహారం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 76 మిలియన్ అనారోగ్యం కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యుహెచ్‌వో) ప్రకటించింది. ఈ సమస్య తీవ్రతను గుర్తించి వివిధ దేశాలు అనేక చట్టాలు అమలులోకి తెచ్చాయి. వాటి తీరుతెన్నులు పరికిస్తే..

 

మన దేశంలో 2006లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసి అందులో వ్యవసాయం, వాణిజ్యం, వినియోగదారుల వ్యవహారాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్యం, శాసన వ్యవహారాలు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలతో కూడిన కమిటీని నియమించారు. ఈ అథారిటీ క్రింద పలు సబ్‌కమిటీలు ఉంటాయి. ఇక ఈ చట్టం ప్రకారం నిందితులకు విధించే శిక్షలు ఈ విధంగా ఉన్నాయి. 
-నాణ్యత లేని ఆహార పదార్థాలను మార్కెట్లోకి విడుదల చేస్తే రూ. 5 లక్షల వరకు జరిమానా.
-తప్పుడు బ్రాండ్‌లు సృష్టిస్తే లేదా ఇతరుల బ్రాండ్‌లు వాడితే రూ. 3 లక్షల వరకు జరిమానా. 
-అనారోగ్యకరమైన, అపరిశుభ్రమై కల్తీ ఆహారాన్ని తయారుచేస్తే రూ. లక్ష వరకు జరిమానా.
-కల్తీ ఆహారం కారణంగా మరణిస్తే రూ. 5 లక్షలు, తీవ్ర అనారోగ్యానికి రూ. 3 లక్షలు, స్పల్ప అనారోగ్యానికి రూ. లక్ష వరకు నష్టపరిహారం. 

-సురక్షితం కాని ఆహారం కారణంగా వినియోగదారుడు అనారోగ్యం బారిన పడితే నిందితులకు 6మాసాల జైలుశిక్షతో పాటు రూ. లక్ష జరిమానా. కోలుకోలేనంత అనారోగ్యం బారినపడితే ఏడాది జైలు, రూ. 3 లక్షల జరిమానా. జైలు శిక్షను ఆరేండ్లు, జరిమానాను రూ. 5 లక్షల వరకు పెంచవచ్చు.
-తప్పుడు ప్రకటనలు, అడ్వర్టయిజ్‌మెంట్లతో మభ్యపెడితే రూ. 10 లక్షల వరకు జరిమానా. 


మరింత సమాచారం తెలుసుకోండి: