గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తన తఢాకా చూపించారు. కేంద్ర ప్రభుత్వం చేయలేని పనిని మోడీ చేసి దేశ గౌరవాన్ని నిలబెట్టారు. దేశ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ కు మోడీ షాక్ ఇచ్చారు. గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'వైబ్రెంట్ గుజరాత్' సదస్సుకు హాజరైన పాకిస్థాన్ వాణిజ్య ప్రతినిధులను సాగనంపారు. సరిహద్దుల్లో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ నుంచి వచ్చిన 22మంది బృందాన్ని సదస్సుకు హాజరు కానీయలేదు. వారిని అహ్మదాబాద్‌లోని హోటల్ గదిలోనే ఉంచేశారు. వారిని భద్రత మధ్య ముంబై పంపేశారు. పాకిస్థానీ బృందం వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు ముందు జరిగిన అమ్మకందారులు - కొనుగోలుదారుల సమావేశంలో పాల్గొన్నారని మోడీ సర్కార్ వివరణ ఇచ్చింది. అందులో పాల్గొనేందుకే పాక్ బృందం వచ్చిందని, గాంధీనగర్‌లో 11, 12 తేదీల్లో జరిగిన ప్రధాన సదస్సులో పాల్గొనలేదని హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే నందా వివరించారు. వారికి అహ్మదాబాద్ వరకే వీసాలున్నాయని, కొందరికి సూరత్‌కు కూడా వీసా ఉండటంతో అక్కడకు వెళ్లారని తెలిపారు. మోడీ తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దేశ సరిహద్దుల్లో ఇద్దరు భారత సైకికులు చనిపోవడంతోపాటు ... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం నోరు మెదపకపోవడంపై బీజేపీ మండిపడింది. దేశానికి ఇంతకంటే పెద్ద అవమానం మరొకటి ఉండదని.. పాకిస్థాన్ పట్ల కఠినంగా ఉండాల్సిన సమయం ఇదేనని బీజేపీ అభిప్రాయపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: