హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్ర మధ్య నీళ్ల యుద్ధం మొదలయ్యే అవకాశాలు అగుపిస్తున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి డెల్టా ప్రాంతానికి వదిలిన నీళ్లను ఆపేయాల్సిందిగా హైకోర్టు రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విధితమే. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు రాష్ర్ట ప్రభుత్వం స్పందించలేదు. దీనితో డెల్టా ప్రాంతానికి చెందిన రైతాంగం పోరాటానికి సిద్దమవుతోంది. వీరికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతును ప్రకటించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ర్ట ప్రభుత్వం మౌనం వహించడంపై డెల్టా ప్రాంతంలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పుపై తెలంగాణ ప్రాంతంలో హర్షం వ్యక్తమవుతుండగా...డెల్టా ప్రాంతం రైతాంగం మాత్రం ఆందోళనలకు సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాలను అడ్డుపెట్టుకుని డెల్టాకు నీళ్లందించకపోతే తామంతా క్రాప్ డాలిడేను ప్రకటిస్తామంటూ ఆ ప్రాంత రైతుల పక్షాన వివిధ పార్టీల నాయకులు అల్టిమేటం ఇచ్చారు. సాగర్ నుంచి వెంటనే నీటిని పునరుద్దరించకపోతే తమ తడాఖ చూపిస్తామంటూ హెచ్చరికను జారీ చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి క్రిష్ణ డెల్టాకు ఇటీవలనే నీళ్లను వదిలిపెట్టారు. తెలంగాణ ప్రజల గొంతును ఎండగడుతూ ఆంధ్రకు నీళ్లను తరలించడంపై టీఆర్ఎస్ ఆందోళనే చేసింది. ఇదే క్రమంలో హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు రాష్ర్ట ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పడంతో పాటు నీళ్లను ఆపాల్సిందిగా ఆదేశించింది. దీనిపై డెల్టా ప్రాంత రైతాంగం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. డెల్టా రైతాంగం హెచ్చరికలతో సరిహద్దులో మళ్లీ వాతావరణం వేడెక్కుతోంది. అటు డెల్టా రైతులు, వివిధ పార్టీల నేతలు, ఇటు టీఆర్ఎస్ మళ్లీ ఉద్యమాలకు సిద్ధమవుతోంది. సాగర్ నుంచి వెంటనే నీటిని పునరుద్దరించకపోతే తమ తడాఖ చూపిస్తామంటూ హెచ్చరికను జారీ చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి క్రిష్ణ డెల్టాకు ఇటీవలనే నీళ్లను వదిలిపెట్టారు. తెలంగాణ ప్రజల గొంతును ఎండగడుతూ ఆంధ్రకు నీళ్లను తరలించడంపై టీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. తెలంగాణ ప్రాంత భూములను ఎండబెడుతూ...ఆంధ్రకు నీళ్లను తరలించకపోవడం ఏమిటనీ టీఆర్ఎస్ గొడవకు దిగుతోంది. ఆంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా తక్కువేమీ తిననట్లుగా తమ ప్రాంతానికి నీళ్లను తీసుకుని పోతాం, ఏం చేస్తారో చేసుకోండంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. నాగార్జున సాగర్ జలాలపై తీర ప్రాంతాల ప్రజలకూ హక్కు వుందనీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జోగి రమేశ్, మల్లాది విష్ణు వాదిస్తున్నారు. అయితే, అవకాశమిస్తే ఆంధ్ర నాయకులు తెలంగాణ ప్రజల కన్నీళ్లను కూడా తరలిస్తారనీ టీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు అంటున్నారు.  తెలంగాణ పంట పొలాలను ఎండబెడుతూ.... క్రిష్ణ డెల్టాకు నీరును విడుదలను చేయడం తెరాస తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఇరు ప్రాంతాల వాళ్లు ఉద్యమాలకు సిద్ధమవుతుండటంతో సరిహద్దు ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఇరు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. మొత్తానికి మళ్లీ సాగర్ జలాల రూపంలో మరోమారు ఉద్యమాలు ఊపందుకునే అవకాశాలు మెండుగానే అగుపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: