ప్రస్తుతం దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర నిర్వహిస్తున్న నాయకులు ఎవరంటే టక్కున వచ్చే సమాధానమే ప్రధాని మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. వీరు ముగ్గురు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొదట మోడీ గురించి మాట్లాడుకుంటే, జాతీయ స్థాయిలో అతి తక్కువ కాలంలో ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన మోడీ కమలం పార్టీ రథ సారథిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ముఖ్యంగా ఎన్నో ప్రజాకర్షణ పథకాలు, కార్యక్రమాలు చేపట్టి దేశద వ్యాప్తంగా ప్రజల ఆధారాభిమానాలు చూరగొన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికీ మోడీ నమో పేరిట తన రికార్డును నిలదొక్కుకొంటూనే వస్తున్నారు. 


Image result for modi kejriwal

ఇక కేజ్రీవాల్ గురించి మాట్లాడుకుంటే, మోడీ సారథ్యంలోని కమల దళం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీకి ప్రతిపక్షంగా అవతరించి ప్రజల ఆధరాభిమానాలను చూరగొని ప్రజా నేతగా పేరొందిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. మోడీ దేశ వ్యాప్తంగా ఇమేజ్ సంపాదించుకున్న సమయంలో మోడీని ఘాటుగా విమర్శించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న నేత కేజ్రీవాల్.


Image result for rahul gandhi

ఇక రాహుల గాంధీ గురించి మాట్లాడుకుంటే, ఆయన పుట్టుకే ఘన రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబంలో జరిగింది. ఆయన ఎదగడమే రాజకీయ లక్షణాలు ఉన్న నాయకుడిగా ఎదిగాడు. కాంగ్రెస్ గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి యువజన నాయకుడిగా, పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యే లకు, యువజన నాయకులకు మార్గదర్శిగా ఎదిగారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంగా ఆయన క్రేజ్ కాస్త తగ్గినా మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తే దేశమంతా రాహుల్ జపం చేస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 


పాపులర్ లీడర్ ఎవరో తెలుసా?

ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నాయకులకు దేశంలో ఉన్న ప్రజాదరణపై ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. గత మే నెలలో నిర్వహించిన ఈ సర్వేలో ప్రధాని నరేంద్రమోదీ ’నమో వేవ్‌’ ఇప్పటికీ దేశంలో బలంగా ఉందని తేలింది. అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా క్రమక్రమంగా కోల్పోయిన తన ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సర్వే తెలిపింది.

Image result for modi

ఈ సర్వే ప్రకారం నరేంద్రమోదీ...
57శాతం మంది భారతీయులు ప్రధాని మోదీకి అనుకూల అభిప్రాయంతో ఉన్నారు. 57శాతం మంది ఆయనను అమితంగా అభిమానిస్తున్నారు.
2015లో మోదీకి 87శాతం మంది ఈ సర్వేలో మద్దతు పలికారు.
అన్ని వర్గాల ప్రజల్లోనూ మోదీకి ప్రజాదరణ ఉంది.
మోదీ పరిపాలన పట్ల 67శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ బాగా పనిచేస్తున్నదని 80శాతం అభిప్రాయపడ్డారు. 2014లో ఇలా చెప్పినవారు 55శాతం మందే.
కాంగ్రెస్‌ మద్దతుదారుల్లోనూ 24శాతం మంది మోదీ పట్ల సానుకూల భావనతో ఉన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ మోదీకి మద్దతు బాగుంది.
’నాలాంటి సామాన్య వ్యక్తులను సం​రక్షణ పట్టించుకునే వ్యక్తి మోదీ’ అంటూ 56శాతం మంది సర్వేలో పేర్కొన్నారు.
మోదీ తాను అనుకున్న విషయాలు చేయగల సమర్థుడు అని 51శాతం మంది అభిప్రాయపడగా.. ఆయన చేయలేరు అని 33శాతం మంది పేర్కొన్నారు.
ప్రజల ఐక్యతకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని 49శాతం అభిప్రాయపడగా.. విభజించి పాలిస్తున్నదని 29శాతం మంది పేర్కొన్నారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వ తీరుపై 61శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, అవినీతి అణచివేతపై 59శాతం, నిరోద్యోగ సమస్య పరిష్కారంపై 62శాతం, పేదల సంక్షేమంపై 62శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.


Image result for rahul gandhi

రాహుల్‌ గాంధీ...
2014తో పోల్చుకుంటే రాహుల్‌గాంధీకి ప్రజాదరణ కొంతమొత్తంలో పెరుగడం గమనార్హం.
63శాతం మంది రాహుల్‌పై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2013లో ఇది కేవలం 50శాతమే.
85శాతం మంది కాంగ్రెస్‌ పార్టీ మద్దతు దారులు తమ నాయకుడిపై సానుకూల అభిప్రాయం కలిగి ఉన్నారని ఈ సర్వేలో తేలింది.  బీజేపీ మద్దతుదారుల్లో 52శాతం మందికి రాహుల్‌ అంటే సదభిప్రాయం ఉందని సర్వే పేర్కొంది.
ఇక సోనియాగాంధీ పట్ల ఇప్పటికే 65శాతం మంది భారతీయుల్లో సానుకూల అభిప్రాయం ఉంది. ఇది 2015లో 58శాతం కాగా, 2013లో 49శాతంగా ఉంది.


Image result for kejriwal

అరవింద్‌ కేజ్రీవాల్‌..
ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజాదరణ తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. 2015లో ఆయన పట్ల 60శాతం మంది సానుకూల అభిప్రాయం వ్యక్తం చేయగా, తాజాగా 50శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు.
ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రజాదరణ కూడా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 47శాతం మంది మాత్రమే ఆప్‌కు మద్దతు తెలిపారు. 2015లో ఇది 58శాతంగా ఉంది. ఆప్‌కు ఢిల్లీలో అత్యధికంగా 57శాతం మంది మద్దతు పలికారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: