గురువారానికి వాయిదా! అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ కూడా శాసనసభలో అవే నిరసనల, నినాదాలు, ఆందోళనలు. ఉదయం శాసనసభ ప్రారంభం అయిన కొద్ది నిమిషాలకే వాయిదా పడింది. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. ఆగ్రహించిన ఎమ్మెల్యేల నినాదాలు, నిరసనలతో అసెంబ్లీ అట్టుడికింది. సడక్‌బంద్‌కు అనుమతి ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్‌ .. వ్యాట్‌ ఎత్తేయాలనే ప్లక్కార్డులతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా విద్యుత్‌ ఛార్జీల పెంపుకు నిరసనగా కరెంట్ బిల్లులు, నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. సహకరించాలని స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ పదేపదే విజ్ఞప్తిచేసినా సభ్యులు శాంతించకపోవడంతో సభను గంటపాటు వాయివేశారు. గంట వాయిదా సభప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సడక్‌బంద్‌కు అనుమఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. తెలంగాణపై తీర్మానం చేయాలంటూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభను రెండుసార్లు వాయిదా వేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: