పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన ఎటువంటి అడ్డంకులు లేకుండా పోయాయి. కాగా ఎన్నికలు రెండు నెలల్లో పూర్తిచేసే అవకాశలున్నాయి. 2001 లెక్కల ప్రకారం బీసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయింది. రాష్ట్రంలో దాదాపు 26వేలవరకు గ్రామపంచాయతీలుండగా కొన్ని మున్సిపాల్టీలు, కార్పోరేషన్లలో కలిశాయి. దీంతో పాటు మరికొన్ని తండాలు, మదిర గ్రామాలు నూతనంగా గ్రామపంచాయతీలు గా ఏర్పడ్డాయి. అయితే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు నివేదిక ఎన్నికల కమీషన్ కు త్వరలో అందనుంది. కాగా రిజర్వేషన్ పూర్తి కావడంతో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించే విషయం సీఎంపై ఆదారపడి ఉంది. అయితే ఇందిరమ్మ బాట, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ఫించన్లు, ఇండ్లు, వివిధ రకాలు సంక్షేమపథకాలు అందజేసిన అనంతరం స్థానిక ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశమున్నందున వచ్చే రెండు నెలల్లో వీటన్నింటిని పూర్తి చేసి తర్వాత ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: