కొత్త జనాభా లెక్కలు కొన్ని సంతోషకరమైన విషయాలను చెప్పాయి. స్త్రీ-పురుషుల నిష్పత్తి కూడా గతంలో కంటే మెరుగవడం ఆశాజనకంగా మారింది.  మొత్తమ్మీద దేశ జనాభా 121 కోట్లకు పెరిగింది.భారతావని జనాభా నూట ఇరవై ఒక కోట్లకు చేరుకుంది. ఇందులో తగ్గుతూ వస్తున్న అమ్మాయిల జనాభా శాతం ఇప్పుడు పెరుగుతోంది.

2001-11 మధ్య పదేళ్లలో మన జనాభా పద్దెనిమిది కోట్లు పెరిగింది. పెరుగుదల రేటు  మాత్రం అంతకుముందున్న 21.5శాతం నుంచి 17.7 శాతానికి తగ్గింది. పురుషుల కన్నా మహిళల సంఖ్యలో పెరుగుదల నమోదైంది. వెయ్యి మంది పురుషులకు గత దశాబ్దంలో 933 మంది స్త్రీలుండగా ఇప్పుడా సంఖ్య 943కి చేరింది. అంటే సుమారు పది శాతం పెరిగింది. కేరళలో మహిళల సంఖ్య 1084 మందితో ప్రథమస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానం తమిళనాడుది. ఇక మన రాష్ట్రం థర్డ్‌ ఫ్లేస్‌లో 993 స్త్రీలతో ఆశాజనకంగానే ఉంది.

ఇన్నాళ్లూ పురుషులతో పోల్చుకుంటే తగ్గుతూ వస్తున్న అమ్మాయిల జనాభా రాష్ట్రంలో మళ్లీ పెరిగి కొత్త ఊపిరినిచ్చింది. అమ్మాయిలంటే ఉన్న చిన్న చూపు వారిని గర్భంలోనే చిదిమేసే పరిస్థితులు గతంలో పెద్ద ఎత్తున సాగడంతో జనాభా తగ్గుముఖం పట్టింది. అమ్మాయిల పట్ల నేడు సమాజ ధోరణిలో మార్పు వచ్చింది. అబ్బాయిల కంటే వారే చదువులలో ముందంజలో ఉంటున్నారు. దీనికి తోడు లింగ నిర్దారణ పరీక్షలపై ఆంక్షలతో భవిష్యత్తులో అమ్మాయిల సంఖ్య పెరిగి అబ్బాయిల కరువు రానున్నట్లు తెలుస్తోంది. ఇక మహిళలు అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. ప్రతీ వెయ్యి మంది పురుషులకు ఇక్కడ 1040 మంది మహిళలు ఉండడం విశేషం. హైదరాబాద్ లో తక్కువగా ఉన్నారు. ఇక ప్రతీ 1000 మందికి 954 మంది స్త్రీలే ఉన్నారు.

దేశవ్యాప్తంగా అక్షరాస్యుల సంఖ్య 76 కోట్లు దాటింది. ఇందులో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందువరుసలో ఉండటం విశేషం. ఓవరాల్‌గా జనాభా లెక్కల్లో అమ్మాయిల పరిస్థితి కాస్త మెరుగుపడడం ఊరటనిస్తోంది. అయితే రాబోయే కాలంలో మాత్రం అమ్మాయిల జనాభే ఎక్కువ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే గనక జరిగితే మరో సమస్య.

మరింత సమాచారం తెలుసుకోండి: