రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్‌ రిషికేష్‌లో ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్‌ యథాలాపంగా ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మరోసారి సామాజిక మాధ్య మాల్లో నెటిజన్లకు టార్గెట్ గా మారారు. చిరిగిన కుర్తాను చూపించిన రాహుల్ పై జోకుల మీద జోకులు పేలాయి. 



 కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు కర్నాటక బీజేపీ కార్యకర్తలు వినూత్నంగా స్పందించారు. ‘‘రాహుల్ గాంధీ 40 రోజుల క్రితం బ్యాంకు నుంచి రూ.4 వేలు విత్‌డ్రా చేశారు. మళ్లీ బ్యాంకులకు వెళ్లలేదు. కాబట్టి ఆయనకు కొత్త కుర్తా కొనుక్కోవడానికి డబ్బుల్లేవు. అందుకని మా యువమోర్చా నుంచి ఆయనకు కొత్త కుర్తా కుట్టించి పంపించాం.



ఆయన చేష్టలకు ముందు ముందు ప్రజలే బుద్ధి చెబుతారు’’ అని హవేలీ యువమోర్చా నాయకుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. తన కుర్తా జేబు చిరిగిపోయిందని, అయినా తాను పట్టించుకోనని, మరి పేదల ప్రతినిధినని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ చిరిగిన బట్టలు వేసుకోవడం ఎప్పుడైనా చూశారా? అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: