పంజాబ్ ఎన్నికల్లో బరిలోకి దిగిన మరో పార్టీ ఆప్ (ఆమ్ఆద్మీపార్టీ) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. శిరోమణి అకాళీదల్ మాదిరిగా కాకుండా కాస్తంత అమలయ్యే హామీలనే దాదాపు ఇచ్చాంది. పంజాబ్‌ ప్రజలపై హామీల వర్షం కురిపించింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా హామీలను ప్రణాళికలో పొందుపరిచింది. ఉచిత పునరావాస కేంద్రాల ఏర్పాటు, అధికారం చేపట్టిన నెలలో రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై నిషేధం వంటి చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 9న ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో పలు ఆకర్షణీయ అంశాలు ప్రకటించింది. వాటిని ఒకసారి పరిశీలిస్తే...


మేమొస్తే ఆస్తి పన్ను రద్దు.. పెన్షన్ రూ.2,500

  • 2018 డిసెంబర్ నాటికి రైతులకు అప్పుల నుంచి విముక్తి
  • ఆస్తి పన్ను రద్దు
  • గృహాలకోసం వినియోగించే విద్యుత్ 400 యూనిట్లకు పొడిగించడం
  • అన్ని జిల్లాలు, సబ్ డివిజన్లలో ఆమ్ ఆద్మీ క్యాంటీన్లలో రూ.5కే భోజనం
  • వృద్ధులకు, వికలాంగులకు, వితంతువుల పెన్షన్ రూ.500 నుంచి రూ.2500
  • యువతకు 25లక్షల ఉద్యోగావకాశాల కల్పన 
  • విదేశీ ఉద్యోగాల శిక్షణకు ఫారిన్‌ ఎంప్లాయిమెంట్‌ బోర్డు ఏర్పాటు .
  • ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.5లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం.
  • ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలో మాదక ద్రవ్యాలను అరికట్టడం.. బాధితులను ఆరునెలల్లో మామూలు మనుషులు చేయడం 
  • డ్రగ్ వ్యాపారంలో భాగస్వాములై ఉన్న రాజకీయ నాయకులను జైలుకు పంపడం.. ఆస్తులు జప్తు
  • రాష్ట్రాన్ని అవినీతి రహితం చేసేందుకు యాంటీ కరప్షన్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్కు స్వతంత్ర ప్రతిపత్తితోకూడిన అధికారాలు
  • మతపరంపేరిట జరిగిన వివక్ష, దాడులకు సంబంధించి ప్రభుత్వం విచారణ చేసి నేరస్తులకు శిక్ష
  • ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెలకే పంజాబ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం
  • ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎర్రబుగ్గ కార్లను ఉపయోగించరాదు

మరింత సమాచారం తెలుసుకోండి: