మోడీ భారత దేశానికి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మన దేశానికి బ్యాచిలర్ సీఎం ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వీరందరికంటే ముందు మోడీ పెళ్లి చేసుకున్నా ఆయన భార్య తో తానేప్పుడో విడిపోయాయని ప్రస్తుతం తాను ఒక్కడినే నని తనకు ఎలాంటి వారసత్వం కానీ లేదని ఆయన చాలా సార్లు బహిరంగ సమావేశాల్లో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే  మోడీ కి ఎలాంటి వారసత్వం లేదని మోడీ ని గెలిపిస్తే కుటుంబం కోసం కాకుండా దేశం కోసం పాలన సాగిస్తారని గ్రహించిన ప్రేజలు మోడీని ప్రధానిగా గెలిపించుకున్నారు.



అయితే ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రులను ఎన్నుకోవడానికి ప్రజలంతా ఇదే ఫార్ములా ను ఫాలో అవుతున్నారని ఈ విషయాన్ని గమనిస్తే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. దేశంలో పెళ్లికాని ముఖ్యమంత్రుల సంఖ్య పెరిగింది. త్రివేంద్రసింగ్‌ రావత్‌ (ఉత్తరాఖండ్‌), ఎమ్‌ఎల్‌ ఖట్టర్‌ (హరియాణా), శర్బానంద సోనోవాల్‌ (అసోం), నవీన్‌ పట్నాయక్‌ (ఒడిశా)లతో కూడిన బ్రహ్మచారి సీఎంల జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా చేరిపోయారు. దేశంలో ప్రస్తుతం ఆరు రాష్ట్రాలకు అవివాహితులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు.


Image result for modi

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌లను మినహాయిస్తే పెళ్లికాని ముఖ్యమంత్రులంతా భాజపాకు చెందినవారే కావడం విశేషం. తాజాగా యూపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆదిత్యనాథ్‌ ఎప్పటి నుంచో సన్యాస జీవితాన్ని గడుపుతున్నారు. రాష్ట్రానికి తొలి బ్రహ్మచారి ముఖ్యమంత్రి ఆయనే. ఉత్తరాఖండ్‌ సీఎంగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన రావత్‌ కూడా అవివాహుతుడే. ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడైన ఆయన వైవాహిక జీవితానికి దూరంగానే ఉండిపోయారు. గతంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా పనిచేసి.. ప్రస్తుతం అసోం సీఎంగా ఉన్న సోనోవాల్‌ బ్రహ్మచారే. ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ ప్రచారక్‌, హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్‌ కూడా పెళ్లి చేసుకోలేదు. వీళ్లంతా కమలం పార్టీకి చెందినవారే. 

మరింత సమాచారం తెలుసుకోండి: