దేశంలో ఉన్నత విద్యాసంస్థలర్యాంకులను కేంద్ర మానవ వనరులఅభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌జావడేకర్‌ సోమవారం విడుదల చేశారు.
ఈ ర్యాంకింగ్స్‌లో ఓవరాల్‌కేటగిరిలో బెంగళూరు ఇండియన్‌ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. 
తొలిపదిస్థానాల్లో ఏడు ఐఐటీ సంస్థలుఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ఇక మేనేజ్‌మెంట్‌ విభాగంలోఐఐఎం అహ్మదాబాద్‌ ప్రథమస్థానందక్కించుకుంది. 
విశ్వవిద్యాలయాలవిభాగంలోనూ బెంగళూరు ఐఐఎస్‌సీతొలి స్థానం సాధించింది.
ఇంజినీరింగ్‌విభాగంలో ఐఐటీ మద్రాస్‌ ప్రథమస్థానంలో నిలవగా, ఐఐటీ హైదరాబాద్‌కుపదోస్థానం దక్కింది. 
యూనివర్శిటీవిభాగంలో హైదరాబాద్‌ కేంద్రీయవిశ్వవిద్యాలయానికి 7వస్థానం, ఉస్మానియాకు 23వస్థానం, విశాఖలోనిఆంధ్రా విశ్వ విద్యాలయానికి 69స్థానం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి68వ స్థానం లభించింది.2015లోజాతీయ విద్యాసంస్థల ర్యాంకింగ్‌వ్యవస్థ ప్రారంభించిన తర్వాతతొలిసారిగా 2016లో ర్యాంకులనుప్రకటించారు. 
దీనికోసం గతేడాది3,563 సంస్థలు దరఖాస్తు చేసుకోగా..ఈ సారి 2,735 సంస్థలే దరఖాస్తు చేసుకున్నట్లుఅధికార వర్గాలు వెల్లడించాయి.
గతేడాది ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట ్‌విభాగంతో పాటు ఈసారి ఓవరాల్‌కేటగిరీని కూడా చేర్చారు.
1. ఐఐఎస్‌సీబెంగళూరు
2. ఐఐటీమద్రాసు
3. ఐఐటీబాంబే
4. ఐఐటీఖరగ్‌పూర్‌
5. ఐఐటీదిల్లీ
6. జేఎన్‌యూదిల్లీ
7. ఐఐటీకాన్పూర్‌
8. ఐఐటీగువాహటి 
9. ఐఐటీరూర్కీ
10. బనారస్‌హిందూ యూనివర్శిటీ.


మరింత సమాచారం తెలుసుకోండి: