రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ డిమాండ్లలో విశాఖ రైల్వే జోన్ ప్రధాన మైనది. విభజనచట్టంలో కూడా విశాఖ రైల్వేజోన్ అంశాన్ని పరిశీలిస్తామని నాటి ప్రభుత్వం పేర్కొంది. నాడు ప్రతిపక్షంలో ఉండి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ కూడా విశాఖ రైల్వే జోన్ ఇస్తామని మాటిచ్చింది. కానీ మూడున్నరేళ్లు గడుస్తున్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం రైల్వే జోన్ పై క్లారిటీ ఇవ్వట్లేదు. కేంద్రంలో చక్రం తిప్పుతున్న రాష్ట్ర నేతలు మాత్రం అదిగో ఇదిగో అంటూ పబ్బం గడుపుకుంటున్నారు.

Image result for విశాఖ రైల్వే జోన్ apherald

విశాఖ రైల్వే జోన్ కోసం గట్టిగా పట్టుబట్టాలని తెలుగుదేశం అడపాదడపా కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఇందుకు రెండు బలమైన కారణాలున్నాయి. విభజనచట్టంతో పాటు స్వయంగా మోదీ హామీ ఇచ్చినందున విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని బీజేపీకి కూడా ఉంది. కానీ ఇందుకు సమయం ఇది కాదనేది ఆ పార్టీ అంతరంగం. ఇందుకు కారణాలు లేకపోలేదు.

Image result for విశాఖ రైల్వే జోన్ apherald

ఒడిశాలో బలపడాలనేది బీజేపీ టార్గెట్. ఇటీవలికాలంలో బీజేపీ అధినేత అమిత్ షా పలుమార్లు ఒడిశాలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) రెండు పర్యాయాలు వరుసగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత సహజంగా ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ పరిస్థితి దారణంగా తయారైంది. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటోంది బీజేపీ. 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ టార్గెట్. ఇలాంటి సమయంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి విశాఖను వేరు చేస్తే ఒడిశాలో బీజేపీపై వ్యతిరేకత రావడం ఖాయం. ఎన్నికల ముందు ఇలాంటి సాహసం చేయడం ఎంతమాత్రం మంచిదికాదనే భావనలో ఉంది బీజేపీ. విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోవడానికి ఇది ఒక కారణం.

Image result for bjp

ఇక రెండో కారణాన్ని చూస్తే.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. తెలంగాణకు సంపూర్ణ మద్దతునిచ్చిన పార్టీగా బీజేపీపై అక్కడి ప్రజల్లో సానుభూతి ఉంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనేది బీజేపీ ప్లాన్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కనీసం ప్రతిపక్ష హోదాను సాధించాలనేది బీజేపీ పెట్టుకున్న టార్గెట్. ఇలాంటి సమయంలో విశాఖ రైల్వే జోన్ ను ప్రకటిస్తే తేనెతుట్టెను కదిపినట్లే.!
ఎందుకంటే ప్రస్తుతం నవ్యాంధ్రలో ఉత్తరాంధ్ర మినహా మిగిలిన రాష్ట్రమంతా సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉంది.
Image result for modi
ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ను ప్రకటిస్తే నవ్యాంధ్ర మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి విడిపోయి విశాఖ జోన్ లో కలుస్తుంది. అదే జరిగితే సౌత్ సెంట్రల్ జోన్ కు ఆర్థికంగా పెద్దఎత్తున నష్టం కలుగుతుంది. విశాఖ జోన్ ను ప్రకటిస్తే తమ ప్రధాన ఆదాయ వనరును ఆంధ్రాకు దోచిపెట్టేసిందనే అపవాదును బీజేపీ మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర – తెలంగాణ మధ్య ఇప్పటికీ పరిస్థితుల్లో పెద్ద మార్పు రాలేదు. ఇలాంటి సమయంలో జోన్ ప్రకటించి తెలంగాణ ప్రజల దృష్టిలో దోషిగా నిలబడడానికి బీజేపీ ఎంతమాత్రం సాహసించదు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోవడానికి ఇది రెండో కారణం.

Image result for telangana andhra

వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఒడిశా, తెలంగాణలు కీలకం. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ ను ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లే. వచ్చే ఎన్నికల తర్వాత తాము అనుకున్న టార్గెట్ రీచ్ అయితే అప్పుడు విశాఖ రైల్వే జోన్ అంశాన్ని బీజేపీ పరిశీలించవచ్చు. అద్భుతం జరిగితే తప్ప అప్పటివరకూ ఆంధ్రుల రైల్వే జోన్ ఆశలు అటకెక్కినట్లే..!


మరింత సమాచారం తెలుసుకోండి: