నంద్యాల ఉపఎన్నికల్లో ప్రచార పర్వం ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నంద్యాల ఉపఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆయా పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఆది నుంచి నంద్యాల ఉపఎన్నిక ఆసక్తికరమే. విజయం కోసం అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం అంతాఇంతా కాదు. చివరకు నామినేషన్ల పరిశీలన సైతం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది.

Image result for శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్

నంద్యాల ఉపఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయనడంలో ఎలాంటి సందేహం. గత ఎన్నికలతో పోల్చితే నంద్యాల సీన్ చాలా డిఫరెంట్. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంది. చివరికి నామినేషన్ పత్రాల పరిశీలనలో సైతం అధికార, ప్రతిపక్షాల మధ్య వైరం కనిపించింది. YCP అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ పై TDP అభ్యంతరం తెలిపింది.
Image result for శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్
ఆయన నామినేషన్ చల్లదని వాదించింది. అలాగే.. అధికార పార్టీ అభ్యర్థులు భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా మౌనికారెడ్డిల నామినేషన్ల పై YCP కూడా ఫిర్యాదు చేసింది. ఇరు పక్షాల నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి.. సక్రమంగా ఉన్నాయని ప్రకటించడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు..


నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. ఇప్పటికే కీలక నేతలతో బహిరంగ సభలు నిర్వహించిన ప్రధాన పార్టీలు... ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఓటర్లను హామీలతో ముంచెత్తుతున్నాయి.
Image result for భూమా బ్రహ్మనందరెడ్డి
భూమా బ్రహ్మనందరెడ్డికోసం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేశారు. అలాగే శిల్పా మోహన్ రెడ్డి తరపున వైసీపీ అధినేత జగన్ బహిరంగ సభ నిర్వహించారు. అయితే నంద్యాల ఉపఎన్నికలో గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఉపఎన్నిక అడుగడుగునా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుంచి అన్ని పార్టీల్లో ఒకటే సస్పెన్స్. టీడీపీ టికెట్ కోసం భూమ వర్గీయులు, శిల్పా వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Image result for భూమా బ్రహ్మనందరెడ్డి
అలాగే వైసీపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారో.. అనుకుంటున్న సమయంలో శిల్పా మోహన్ రెడ్డి జంప్ కావడం.. ఆ పార్టీని సంతోషంలో ముంచెత్తింది. ఆ తర్వాత ప్రచారం, నామినేషన్ ప్రక్రియల్లో కూడా అడుగడుగునా ఉత్కంఠ ఎదురైంది. ఇకపైనా కూడా ఇదే ఉత్కంఠ కనిపించనుంది. ఎందుకంటే .. రెండు ప్రధాన పార్టీలూ నువ్వా నేనా.. అన్నట్టు తలపడుతున్నాయి. సో.. ప్రతిరోజూ ఏదో ఒక సెన్సేషన్ నంద్యాలలో క్రియేట్ కావడం తథ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: