చంద్రబాబు ఏం చేసినా వెరైటీగా ఉంటుంది. తన పార్టీలోని నేతలను లీడర్లుగా తీర్చిదిద్దాలనేది ఆయన కోరిక. ఆయన కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ తీసుకుంటూ సమకాలీన అంశాలను అప్ డేట్ చేసుకుంటూ ఉంటారు. టెక్నాలజీని అప్ డేట్ చేసుకుంటూ ఉంటారు. తనలాగే తన పార్టీ నేతలు కూడా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇటీవల జరిగిన వర్క్ షాప్ లో ఓ పరీక్ష పెట్టారు. అది చూసి నేతలు తలలు పట్టుకున్నారు.

Image result for tdp

మీ ఆహార్యాన్ని మీరు ఎలా నిర్వచించుకుంటారు?

మీ అత్యధిక విద్యార్హత ఏంటి?

ప్రస్తుతం మీ జీవనాధారం ఏంటి?

ప్రస్తుతం మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారు?

ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగం ఏంటి?

కార్యనిర్వాహకవర్గంలో మీ స్థానమేంటి?

ప్రస్తుత మీ ఉద్యోగంలో మీరు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారు?

మీకు అప్పగించిన పనిని నిర్వహించే క్రమంలో మీరు ఎంతమేర తృప్తిగా ఉన్నారు.?

మీకు ఏదైనా అంగవైకల్యం ఉందా..?

మీరు టీంను లీడ్ చేయాలనుకుంటున్నారా..?

నిర్ణయాలను తీసుకునే సత్తా మీకుందా..?

.... చూశారుగా ఈ ప్రశ్నలను..! ఇలాంటి ఎన్నో ప్రశ్నలను టీడీపీ వర్క్ షాప్ లో నేతలకు అందించారు. పైగా ఇవన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయి. చాలా మంది నేతలకు ఇంగ్లీష్ అర్థం కాక పక్కనున్నవారిని అడిగి అనువదించుకున్నారు. అయినా సమాధానాలు రాయలేక తటపటాయించారు.

Image result for tdp WORKSHOP

          ఈ ప్రశ్నలను రూపొందించింది థామస్ ఇంటర్నేషనల్ సంస్థ. వ్యక్తిత్వ లక్షణాలను బేరీజు వేసి వారిని మరింత ఉన్నతులగా తీర్చిదిద్దేందుకు అవసరైన ట్రైనింగ్ ను థామస్ ఇంటర్నేషనల్ అందిస్తుంది. టీడీపీ నేతల్లోని నాయకత్వ లక్షణాలను బేరీజు వేసి వారిని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ఈ ప్రశ్నావళిని రూపొందించారు. వారి సమాధానాలు బేరీజు వాసి వారికి అవసరమైన ట్రైనింగ్ ను అందించనున్నారు. అయితే నేతల పర్ఫార్మెన్స్ ను గోప్యంగా ఉంచనున్నారు.

Image result for tdp WORKSHOP

          అయితే ఈ ప్రశ్నావళిపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి ప్రశ్నలవల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయనుకోవడం భ్రమేనని ఓ నేత వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులకు ఇలాంటివాటితో పనేముందని.. కార్పొరేట్ నేతలకు అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదండీ సంగతి.! మరి బాబు వీరిని ఎలా మారుస్తారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: