గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానినీ టార్గెట్ చేసిన తెలుగుదేశం వరుసగా దెబ్బతీసి సక్సెస్ అవుతోంది. గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీని మరో చావుదెబ్బతీసింది. గతంలో పార్టీ మారిన తమ కౌన్సిలర్ ని చెప్పుతో కొట్టిన వైసీపీ ఫ్లోర్ లీడర్ రవికాంత్ ఇప్పుడు టిడిపి తీర్ధం పుచ్చుకోవడం విశేషం.

Image result for gudiwada kodali nani

గుడివాడ పొలిటికల్ సీన్ మారిపోతోంది. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే  కొడాలి నాని ని టార్గెట్ చేసి రాజకీయంగా దెబ్బకొట్టేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.  నానిని దెబ్బతీసి బాబుకి చేరువయ్యేందుకు కృష్ణాజిల్లా మంత్రులు దేవినేని ఉమా, కొల్లురవీంద్ర స్కెచ్ వేశారు. అందులో భాగంగా గుడివాడ కౌన్సిల్ ని వైసీపీ నుంచి లాక్కోవడంలో ఇప్పటికే సక్సెస్ సాధించిన టీడీపీ ..మిగిలిన కౌన్సిలర్లను కూడా లాక్కొంటూ నానిని మరింత దెబ్బకొడుతున్నారు.

Image result for gudiwada kodali nani

36 మంది కౌన్సిలర్లున్న గుడివాడ మున్సిపాల్టీ లో గత ఎన్నికల్లో 21 మంది వైసీపీ సభ్యులు గెలుపొందారు. దీంతో గుడివాడ మున్సిపాలీటీని వైసీపీ గెలుచుకుంది.  దీంతో మున్సిపల్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాస్ కి ముగ్గురు పిల్లలు ఉన్నారంటూ నిబంధనలు తెరపైకి తెచ్చిన టీడీపీ ఆయన ఛైర్మన్ పదవికి అనర్హడుని తెలుగుదేశం నేత లింగప్రసాద్ తో ఫిర్యాదు చేయించారు. దీంతో  పదవిని వదులుకోలేక యలవర్తి  ఏకంగా  9 మంది వైసీపీకౌన్సిలర్లతో కలిసి టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత మరో ముగ్గురినివై సీపీ నుంచి టీడీపీలోకి చేర్చుకున్నారు. ఆ సంఘటనతో అప్పట్లో పెద్ద యుద్దమే జరిగింది. ఛైర్మన్ యలవర్తిని వైసీపీ కౌన్సిలర్ రవి చెప్పుతో కొట్టేంతవరకూ వెళ్లింది.

Image result for gudiwada ravikanth

ఇప్పుడు అదే రవికాంత్ వైసీపీని వదిలి మంత్రుల సమక్షంలో టిడిపిలో చేరిపోయారు. నానిపై విమర్శనాస్ర్తాలు సంధించారు. కొడాలి నానికి సొంత ఊరిలో చెక్ పెట్టేందుకు ఇద్దరు మంత్రులు పదేపదే వైసీపీని చీల్చడంతో నైతిక ప్రమాణాలు ఏమిటని నాని వర్గం ప్రశ్నిస్తోంది. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఎన్నికల్లో గెలవాలని సవాల్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: