నంద్యాల ఉప ఎన్నిక ఫలితం కర్నూలు జిల్లాలో అనేక పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితంతో ప్రజలలో తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకం పోలేదని మరోసారి రుజువైంది అంటున్నారు టీడీపీ నేతలు . ఈ క్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు వివిధ సంఘాలకు చెందిన నాయకులు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అయితే కర్నూలు జిల్లాలో మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది.


ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కేఈ ప్ర‌భాక‌ర్ బ‌రిలోకి దిగారు….ప్రతిపక్ష పార్టీ తరఫున కనీసం అభ్యర్థిగా నిలబడడానికి కూడా వైసిపి నుండి ఎవరు పోటీ చేయడంలేదు ఇది ఉప ఎన్నిక ఫలితమో ఏమో కనీసం పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారు వైయస్ఆర్ సీపీ నాయకుడలు.ఈ సమయంలో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అవుతున్న తరుణంలో అనూహ్యంగా ముగ్గురు స్వతంత్రులు నామినేషన్ వేయడంతో ఎన్నికలు అనివార్యం అన్న పరిస్థితి ఏర్పడింది. 


నామినేషన్ వేసిన ముగ్గురిలో ఇద్దరి నామినేషన్లు చెల్లకుండా పోయాయి. ఇంకో స్వతంత్ర అభ్యర్థి మాజీ టీడీపీ నేత,మరియు రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు అయిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి అనుచరుడు.ఈ క్రమంలోతెలుగుదేశం పార్టీ నాయకులు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలుఏకగ్రీవం చేయాలనే నేపథ్యంలో తన అనుచరుడి నామినేషన్ ఉపసంహరించుకోవాలని బైరెడ్డి రాజశేఖరెడ్డి తో ఒక రోజంతా చ‌ర్చ‌లు జ‌రిపిన కేఈ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆయ‌న‌ను బుజ్జ‌గించి పార్టీ అధినేత చంద్ర‌బాబుతో అపాయింట్‌మెంట్ ఇప్పించారు.ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.



ఈ భేటీ తర్వాత తన అనుచరుడితో నామినేషన్‌ ఉపసంహరింపజేయడానికి ఆయన అంగీకరించినట్లు సమాచారం.అంతే కాకుండా బైరెడ్డి రాజశేఖర్రెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు సమాచారం దానికనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కి తగిన సముచిత స్థానం ఇస్తా అన్నట్టు  అన్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: