పవన్ ను రాజకీయాల్లో ఒక విలక్షణ మైన వ్యక్తి గా ప్రజలు అతన్ని చూసినారు. అందరి రాజకీయ నాయుకుడి గా  కాదు నిజంగానే ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉండే నాయుకుడి గా అందరు చూసినారు. 3 ఏళ్ల క్రితం పార్టీ ని స్థాపించి, నాకు అధికారం ముఖ్యం కాదు. ప్రజల సమస్యలే ముఖ్యం నేను ప్రశ్నించడానికి వస్తున్నా అని హైదరాబాద్ లో భారీ బహి రంగ సమావేశం లో చెప్పినాడు. ఆ మాటలు విని ప్రజలు జేజేలు పలికినారు. నిజంగానే ఒక మంచి నాయుకుడు వచ్చాడని అందరు అనుకున్నారు.

Image result for pavan kalyan janasena

అయితే పార్టీ పెట్టి 3 ఏళ్ల కాలం లో అప్పుడప్పడు రావడం తప్పితే ఎప్పుడు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాలేదు. ఇప్ప్పటికి రాలేదని చెప్పవచ్చు. అయితే   ప్రశ్నించడానికి వస్తున్నా అని చెప్పిన పవన్ ఇప్పుడు ఎందుకు టీడీపి ని  ప్రశ్నించడం లేదు అని అందరికి సందేహాలు ఉన్నాయి. అయితే హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టడం లేకుంటే ట్విట్టర్ లో స్పందించడం ఇది కాదు ప్రజలకు సేవ చేయడం లేదా ప్రశ్నించడం అంటే, మొదటగా పవన్ కళ్యాణ్ ఇది తెలిసి కోవాలి. ప్రజల తో మమేకం అవ్వాలి ప్రజల సమస్యల కోసం పోరాడాలి చివరకు సాధించాలి.

Image result for pavan kalyan janasena

ఇప్పటివరకు ఇటువంటిది పవన్ గారు ఏమి చేయలేదు. అయితే నా పార్టీ ఉండేది  ప్రశ్నించడానికి అని చెప్పుకుంటాడు. ప్రతి పక్ష నాయుకుడు ఒక పక్క పోరాటాలు, పాదయాత్రలు మరియు దీక్షలు చేసి అధికార పార్టీ మీద పోరాడుతున్నారు. పవన్ ఈ 3 ఏళ్లలో ఏం చేసాడో తను చెప్ప గలడా తను స్పందించడం, చంద్ర బాబు నాయుడు నేను చేస్తానని హామీ ఇవ్వడం ఇదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అందరికి అర్ధం అవుతుంది. నిజంగా మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే చంద్ర బాబు నాయుడు ఇచ్చిన హామీలను నేరవేర్చేలా పోరాటం చేయండి.

Image result for pavan kalyan janasena

అవేమి చేయకుండా నేను ప్రశ్నించడానికి వస్తున్నా అంటే ఎవరు నమ్మరని  పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. 2014 ఎన్నికల్లో టీడీపి ఇచ్చిన హామీలకు నాది పూచి అన్నాడు. ఇప్పుడు అదే చంద్ర బాబు నాయుడు హామీలను  నేరవేర్చకపోతే  మీరు ఎందుకు  ప్రశ్నించడంలేదు. ఎందుకంటే 2019 లో టీడిపి ఎన్నో కన్ని సీట్లు ఇస్తుంది కాబట్టి, అంటే పవన్ కూడా ఒక స్వార్థ రాజకీయ నాయుకుడిగా ఆలోచిస్తున్నాడని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: