బక్కన్న కేసిఆర్ కు బతుకుడుపై బెంగ పట్టుకుంది, తనను ఎవరో చంపాలని చూస్థున్నారు అంటున్నాడు, బాబ్బాబు బతికించండి అంటూ ప్రభుత్వాన్ని బతిమిలాడాడు. అంత పెద్ద మనిషి నన్ను చంపేస్థున్నారు, రక్షించండి అన్నాకా గవర్నమెంట్ ఎలా ఊరుకుంటుంది, వెంటనే ఆయనకు భారీ భద్రతను కల్పించింది.

కేంద్రం తెలంగాణ ప్రకటించాకు కేసిఆర్ ను చంపేందుకు ఓ సారి ప్రయత్నం జరిగిందని, రెక్కీ కూడా నిర్వహించారని ఆయన అల్లుడు హరీష్ రావు ఆందోళన వ్యక్థం చేసాడు, తెలంగాణ ఇచ్చేసాక ఇంకా ఆయనతో అవసరం ఎవరికి అన్న అనుమానాలను కూడా పలువురు వ్యక్థం చేసారు. పైగా ఆయన కుమారుడు కేటిఆర్, కవితలకు నాన్న పై లేని బెంగ అల్లుడు హరీష్ రావుకు ఎందుకూ అంటూ కూనిరాగాలు తీసారు మరికొందరు.

సరే బక్కన్న కేసిఆర్ ను చంపే అవసరం ఎవరికైనా ఉందో లేదో కాని ఆయన ఆర్జీని ప్రభుత్వం స్వీకరించింది. ఏకంగా దేశంలో ఓ అయిదారుగురికి మాత్రమే ఉన్న అసాధారణ భద్రత జడ్ ప్లస్ కల్పించమని అడిగారు కాని గవర్నమెంట్ ఆ పని చేయలేదు. ఆయన భద్రత కోసం ఓ బుల్లెట్ ఫ్రూఫ్ కారునిచ్చింది. ఆయన ఎప్పుడు హాయిగా నిద్రపోయే ఫాంహౌజ్ వద్ద పోలీసు బలగాలను పెంచింది. బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించింది. లక్ష్యాన్ని సాధించాక ఆయనకు బతుకుపై బెంగ పట్టుకోవడమే అందరిని  ఆశ్చర్యానికి గురి చేస్థోందన్న వాదనలు మాత్రం రాజకీయవర్గాల్లో వ్యక్థమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: