మోడీ ఏంటీ జగన్ కు ఝలక్ ఇవ్వడమేంటి అనుకుంటున్నారా ? అయితే ఇది మీరు తప్పక చదవాల్సిందే. ఈసారి  ఎన్నికలలో ఎలాగైనా  గెలవాలన్న బలమైన కోరికతో జగన్ పాదయాత్రను చేపట్టాడు. ప్రస్తుతం జగన్ నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మొన్ననే వెయ్యి కిలోమీటర్ల వరకు నడక సాగించి ఒక మైలురాయిని అందుకున్నాడు. అయితే ఈ పాదయాత్ర ద్వారా కొన్ని ప్రాంతాలను మాత్రమే కవర్ చేస్తున్నాడు. దీని త‌రువాత  రెండు నెల‌లు విశ్రాంత్గి  తీసుకుని  పాద‌యాత్ర‌లో క‌వ‌ర్ చేయ‌లేక‌పోయిన ప్రాంతాలను బ‌స్సు యాత్ర‌తో కవర్ చేయాలని జగన్ ప్రణాళిక  వేసుకున్నాడు.


అయితే జగన్ వేసుకున్న ప్రణాళికలు అన్నీ  ముందస్తుగా అనుకున్నట్లుగా జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే జగన్ కు మోడీ కోలుకులేని దెబ్బవేయబోతున్నాడంట . అదేంటంటే ఈ  సంవత్సరం ముగిసేలోపు అంటే డిసెంబర్  లోపు దేశ వ్యాప్తంగా  ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని భావిస్తోందట  బీజేపీ ప్రభుత్వం. దీనికోసం ఇప్ప‌టినుంచే త‌మ పార్టీ పాల‌న‌లో ఉన్న ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ని ఒప్పించి,ఎన్నికలకు తయారుగా ఉండమన్నట్లు సమాచారం. ఈ సంవత్సరం డిసెంబ‌ర్ కల్లా లోక్‌స‌భ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కూడా సిద్ధంగా ఉండమని తమ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిందట.


అయితే మోడీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ చూసి జగన్ దిక్కుతోచని స్థితిలో  ఉన్నాడట. అందుకు కారణం కూడ లేకపోలేదు. ఎందుకంటే జగన్ పాదయాత్ర జులైలో  పూర్తవుతుందని అంచనా వేశారు. అవికూడా కొన్ని నియోజక వర్గాలు మాత్రమే! మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల సంగ‌తేంటి ? బస్సు యాత్ర  ఎప్పుడు ఆరంభించాలి, ఎప్పుడు ముగించాలి, కార్యకర్తలను ఎలా సమన్వయించాలి, ఎన్నికలకు ఎప్పుడు సిద్ధం అవ్వాలిరా నాయనో అని జగన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడట. అసలే జగన్ బీజేపీ తో పొత్తు పెట్టుకుంటాడు అని వార్తలొస్తున్న వేళ మోడీ ఈ ప్రణాళిక వేసినట్లుగా వస్తున్న ఈ వార్తలు ఏపీలో రాజకీయాలను మాంచి రసపట్టును కలిగిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: