ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో కరవు జిల్లా అయిన అనంతపురం జిల్లా మిద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా ఉగాది పండుగనాడు చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా రైతులకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు కొన్ని దశాబ్దాలుగా నిరు లేక ఎండిపోతున్న పంట భూములకు నీరందించడానికి పూనుకొన్నారు చంద్రబాబు.


దాదాపు కొన్నేళ్లుగా నీరు లేక ఎండిపోయిన చెరువులకు వేసవి కాలంలో హంద్రీ నీవా నీరు అందిస్తుండటంతో రైతుల కళ్లలో ఆనందం నిండింది ఏపీ ప్రభుత్వం రైతులకిచ్చే ఉగాది కానుక ఇదేనని శాసనమండలి చీఫ్ విప్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద ఉన్న ఓ చెరువుకి నీటిని విడుదల చేశారు..ఈ సందర్భంలో పయ్యావుల మాట్లాడుతూ ఎండిపోయిన చెరువులకు హంద్రీనీవా నీటిని అందిస్తున్న ఘనత సీఎం చంద్రాబుదేనని ప్రశంసించారు.


దశల వారీగా అన్ని చెరువులకి నీరు అందేలా చేస్తామని తెలిపారు. ఈ పరిణామంతో అనంతపురం జిల్లా రైతులు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతులు ఈ ఉగాది పండుగ నిజంగా మా జీవితాలలో మా బ్రతుకులలో పంట భూములలో వెలుగు నింపింది అని అన్నారు.


తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జిల్లాల చాలా చోట్ల గెలుపొందడం కాయం  అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




మరింత సమాచారం తెలుసుకోండి: