ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమం సాక్షిగా బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస రావు, మాణిక్యాల రావు తమ రాజీనామాలు అసెంబ్లీలో సమర్పించారు.  ఈ సందర్భంగా ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస రావు తన రాజీనామా సమర్పిస్తూనే..రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తెగ పొగిడేశారు. తనకు కేబినెట్‌లో అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబకు కామినేని శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు.  బీజేపీ వల్ల దేశానికి, టీడీపీ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలు నమ్మారు..నేనూ నమ్మాను అన్నారు.

ఇప్పటి వరకు అంతా మంచే జరిగింది..జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.  కానీ ఇప్పుడు ఉన్న పరిణామాలు మాత్రం ఆంధ్రరాష్ట్రానికి మంచి జరుగుతుందనే విధంగా లేదనిపిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కొన్ని నిజాలు చెప్పాలి..లేదంటే మన మీద మనకే నమ్మకం పోతుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడే మంచి చేయగలరని చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు..కానీ ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అంత కష్టపడలేదే..చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ది కోసం అహర్శిశలూ కష్టపడుతున్నారని అన్నారు. ఇక్కడ ఏ నాయకుడినైనా అడిగి తెలుసుకోవాలని ఆయన ఎంతో కృషి చేస్తున్నారో అన్న విషయం...అంటూ పొగిడారు.   

నిన్న మూడు గంటల స్పీచ్ నిలబడి ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం వేసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో చూపించాలని ఆయన కోరకుంటున్నారని అన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీనామా విషయం తెలుసుకున్న తోటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు ఆయను కలిసి బాధపడవద్దని చెప్పారు. రాజీనామా చేస్తున్నందుకు తాను సంతోషంగానే ఉన్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఎంట్రీ ఎంత ముఖ్యమో.. ఎగ్జిట్ కూడా అంతే ముఖ్యమని, ఆ కోరిక నెరువేరుతోందని మంత్రి అచ్చెన్నాయుడితో కామినేని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: