ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదు అయ్యింది. తానింబార్ దీవుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలిజికల్ సర్వే వెల్లడించింది. సోమవారం తెల్లవారు జామున వచ్చిన ఈ భూకంపంతో తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత వెంటనే ఉపసంహరించుకున్నారు. బాండా సముద్రంలోన 171 కిలోమీటర్ల లోతులో భూమి ఉపరితలంపై ఈ భూకంపం వచ్చినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఇది ఆ దీవులకు వాయువ్యంగా 222 కిలోమీటర్ల దూరాన నమోదైందని, అయితే ప్రాథమికంగా ఇంతవరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం రిపోర్టు కాలేదని, ఫసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదని ఆ సర్వే వివరించింది. ఇటువంటి భూకంపమే ఫిబ్రవరి 26వ తేదీన వచ్చింది. అయితే నష్టమేమీ జరగలేదు. ఇండోనేషియా సీస్మిక్ యాక్టివిటీ హాట్‌స్పాట్ అే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉంది.
Earthquake
దానివల్ల ఇండోనేసియాలో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. వాటిలో చాలా వరకు ప్రమాదరహితమైనవే. దిలావుండగా ఆస్ట్రేలియాలో ఉత్తరాన డార్విన్‌ నగర తీరం బాండా సముద్రంలో 171.5 కిలో మీటర్ల లోతు కూడా భూమి కంపించిందని, అయితే సునామీ హెచ్చకలేమీ లేవని ఆస్ట్రేలియా వాతావరణ విభాగం తెలిపింది. కాకపోతే ఆస్ట్రేలియాలో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: