చంద్ర బాబు నాయుడు బిజెపి లో నుంచి బయటికి వచ్చి ఆ పార్టీ మీద విష ప్రచారం చేసి ఆ పార్టీ ని ప్రజల దృష్టిలో విలన్ ను చేసేశాడు. అంతే కాకుండా డిల్లి స్థాయిలో కి వెళ్లి మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి అన్ని విధాల ప్రయత్నం చేసాడు. ఆ ప్రెస్ మీట్ లో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు కొన్ని వీడియోలు ప్రదర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తా అంటూ.. మోడీ ప్రకటించిన దృశ్యాలను వీడియోలో చూపించారు. ఆ రకంగా మోడీని బద్నాం చేయాలనుకున్నారు.
Image result for chandrababu naidu
ఇప్పుడు రాష్ట్ర భాజపా నాయకులకు మార్గం దొరికిపోయింది. చంద్రబాబు గురించి కూడా పాత వీడియోలు బయటకు తీసి.. వాటిలో కొన్ని ముక్కలు కత్తిరించి చక్కగా ఎడిట్ చేయించి.. వాటినే అస్త్రాలుగా ప్రయోగించడానికి కమలదళం సన్నద్ధం అవుతోంది. చంద్ర బాబు వేసిన ఎత్తుగడకు దిమ్మ తిరిగే రీతిలో రిప్లై ఇవ్వాలని భావిస్తుంది. ప్రత్యేకప్యాకేజీ అనే దానికి ఒప్పుకున్న తర్వాత.. చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదాను ఎంతగా ఈసడించుకుంటూ మాట్లాడారో అందరికీ తెలుసు.
Image result for chandrababu naidu
ప్రత్యేకహోదా కోసం పోరాడేవాళ్లనంతా జైల్లో పెట్టిస్తానన్నది ఆయనే.. అప్పట్లో పెట్టిన పోలీసు కేసులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఆ రకంగా అప్పట్లో స్పెషల్ ప్యాకేజీ పరమాద్భుతం అని కీర్తిస్తూ.. ప్రత్యేకహోదా యూజ్ లెస్ అని ఛీత్కరిస్తూ చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలు, చేసిన ప్రసంగాలను బయటకు తీసేపనిలో భాజపా నాయకులు ఉన్నారు. వాటి సాయంతో మాటమార్చడంలో ప్రజలను వంచించడంలో చంద్రబాబే నెంబర్ వన్ అంటూ ఎదురుదాడికి దిగడానికి సిద్ధమవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: