ఇన్నాళ్లు తన పని తాను చేసుకుంటూ పోయే పవన్ తాను స్పందిస్తే ఎలా ఉంటుందో అందరికీ  ట్రైలర్  చూపిస్తున్నాడు . ఇకపై  తనకు సంబంధంలేని విషయాల్లో తన, తనవారి పేర్లను ఇరికించాలనుకునేవారికి  తాను ఇప్పుడు స్పందిస్తున్న తీరు గుర్తుకు వచ్చి తన పేరు చెప్పడానికి  సైతం వణికిపోయేలా  అందరి బండారాలను బయటపెడుతున్నాడు .


ఇప్పటికే టీవీ9 రవి ప్రకాష్ వీడియోను   ఫోటోను బయటపెట్టిన పవన్ ఆయన సతీమణికి  కూడా వారి పిల్లలకు  టీవీ9 చూపించకండి  అంటూ చురకలు  అంటించాడు.  ప్రస్తుతం పవన్ ఫోకస్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీదకి మరలింది. నా తల్లిని తిట్టడానికి ప్లాన్ రచించిన బృందంలో ఆర్కే కూడా ఒకడంటూ నిన్న తెలిపిన పవన్, ఈరోజు ఆయనను టార్గెట్ చేశాడు.


గుడ్ మార్నింగ్ ఆర్కే అంటూ మొదట ఒక ట్వీట్ చేసిన పవన్, "బట్టలూడదీసి మాట్లాడుకుందాం - బట్టలూడదూసి కొడదాం" కార్యక్రమానికి మీకు స్వాగతం ఆర్కే అంటూ తన రెండో ట్వీటులో ఆసక్తిని రేపాడు. అయితే తన మూడో ట్వీటులో "ఆర్కే , నువ్వు నడిపే పేపర్ పేరు ఆంధ్రజ్యోతా ? టీడీపీజ్యోతా ? ఎందుకంటే అది ఆంధ్రులకి సంబందించింది ఐతే కాదు .. అసలు ఎందుకంటున్నారో ఈ మాట అనేది వచ్చే కొద్దీర్ వారాల్లో ఒక స్పష్టత వస్తుంది" అంటూ రాసుకొచ్చాడు. పవన్ ఇంకా ముందు ముందు ఎలాంటి షాకులు ఇవ్వబోతాడో అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: