సాధారణంగా మనకన్నా చిన్నవాళ్లు ఎవరైనా తప్పు చేస్తే గాడిద అని తిడుతుంటారు..అంతగా తిడుతుంటగే ఆ తిట్టు వాళ్లకు బాగా నచ్చినట్టుంది..అందుకే గాడికు ఎగ్జామ్ హాల్ టికెట్ ఇచ్చారు. అదేంటీ గాడిదకు  ఎగ్జామ్ హాల్‌ టిక్కెట్ అని అనుకుంటున్నారా..! అవునండీ నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా... ఇది నిజంగానే జరిగింది.  అసలు విషయానికి వస్తే.. జమ్మూ కాశ్మీర్‌లో తహసీల్దార్ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు... ఎగ్జామ్‌ హాల్‌టిక్కెట్లను ఆన్‌లైన్‌లో పెట్టిందట.
Donkey issued admit card
ఎగ్జామ్ కోసం దరఖాస్తులు చేసిన అభ్యర్థులు వారి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకుంటున్న సమయంలో ఇలాంటి విచిత్రం ఓ అభ్యర్థికి జరిగిందట. అంతే హాల్ టికెట్ చూసుకున్న అ అభ్య‌ర్ధి కంగుతిన్నాడు. అభ్య‌ర్ధికి హాల్ టికెట్ లో త‌న ఫోటో బ‌దులు గాడిద ఫోటో ఉండ‌డం చూసి షాక్ అయ్యాడు. గోధుమ రంగు ఉన్న గాడిద అని అర్ధం వ‌చ్చేలా చూర్ కర్ అనే పేరుతో... ఓ గాడిద ఫోటోతో ఉన్న హాల్ టిక్కెట్ ప్ర‌త్య‌క్ష‌మైంది.
Image result for donkey
అంతేకాదు అభ్యర్థి, బోర్డు సెక్రటరీ సంతకం కూడా ఉంది. దీంతో సద‌రు అభ్య‌ర్ధి ఆ హాల్ టికెట్ ను నెట్టింట్లో పోస్ట్ చేయ‌డంతో వైరల్ అయ్యింది. గతంలో కూడా కొన్ని సాంకేతిక లోపాల వల్ల సినీ, రాజకీయ నాయకులు ఫోటోలతో హాల్ టికెట్లు ప్రింటగ్ అయ్యాయి.  దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..ప్రభుత్వం వారు ఇప్పుడు గాడిదతో పరీక్ష రాయించడంటూ జోకులు పేలుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: