జైల్లో ఉన్న జగన్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ సమర్పణలో ఓ భారీ చిత్రం విడుదలకు సిద్దమైంది, సినిమాను ఈనెలలోనే విడుదల చేసేందుకు అంతా సిద్దం చేసారు. ఇది బాక్సాఫీస్ బద్దలు చేస్థుంది అన్న భారీ అంచనాల మద్య విడుదల అవుతోంది. యమ స్పీడ్ గా షూటింగ్ పూర్థిచేసుకున్న ఈ సినిమా టీజర్ గురువారం విడుదలయై సంచలనం సృష్టించింది. టీజర్ దెబ్బకు అప్పుడే చంద్రబాబు బాక్స్ బద్దలవుతున్న సంకేతాలు వెలుబడ్డాయి.

అసలు సినిమాలకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అడ్డంకిగా మారిన తరుణంలో జగన్ ఈ భారీ రాజకీయ చిత్రాన్ని విడుదల చేస్థున్నారన్న వదంతులు ఉన్నాయి. ఈసినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరిక్రిష్ణ  ప్రధానపాత్ర పోషిస్థున్నాడు. కథకు మూలం మహానేత ఎన్టీఆర్ ఆశయాలు, అందుకే ఈ సినిమా రాజకీయాల్లో సంచలనాలను క్రియేట్ చేస్థుందని అంటున్నారు. ఈ సినిమాకు టైటిల్ కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ తీసిన రాజకీయ చిత్రం ‘చైతన్య రథ యాత్ర’ అని టైటిల్ ఫిక్స్ చేసారు.

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ పోతేనే మనుగడ, జగన్ ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ టిడిపితో కుమ్ముక్కయిందన్న ఆరోపణలు ఎలాగు ఉన్నాయి. సీమాంధ్రలో జగన్ ను దెబ్బతీసేందుకు చంద్రబాబు తాజాగా ఎత్తులు వేస్థన్నాడన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఆత్మగౌరవ యాత్ర నిర్వహించి జగన్ ను టోటల్ గా సీమాంధ్రలో పాతరేసే పనికి శ్రీకారం చుట్టాడు చంద్రబాబు అని అందరు అనుకుంటున్నదే.

అందుకే జగన్ దానికి కౌంటర్ ఎటాక్ చేసాడట, ఇప్పటికే జగన్ కు జూనియర్ కు మద్ద సత్సంబందాలు ఉన్నాయని, చంద్రబాబు తో విభేదించి తన మితృడు కొడాలి నానిని జగన్ వద్దకు చేర్చి పరోక్షంగా ఆయనకు వెనుక బాసటగా ఉంటున్నాడని అందరు అనుకుంటున్న విషయమే. ఇప్పుడు అసలైన సమయంలో జగన్ తన అమ్ముల పొదిలోని జూనియర్ అస్త్రాన్ని సంధించారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

హరిక్రిష్ణ, బాలక్రిష్ణల మద్య చంద్రబాబు పెట్టిన చిచ్చును జగన్ తన ఆయుధంగా మార్చుకుని, ఇప్పుడు జూనియర్ ద్వారా హరిక్రిష్ణను చంద్రబాబు పైకి బాణంలా వదిలాడు అంటున్నారు రాజకీయవిశ్లేషకులు. రాజీనామా చేయించి సమైక్యాంధ్రకోసం ఎన్టీఆర్ పేరును వాడుకొని ( ఇప్పటికి ఎన్టీఆర్ అంటే సీమాంధ్రలో విశేష అభిమానం ఉంది కాబట్టి) చైతన్య యాత్ర కు స్కెచ్ వేసాడని అంటున్నారు. దీని వెనుక జగన్ ఉన్నాడా... లేదా, జూనియర్ పాత్ర ఉందా.. లేదా,  అన్నది పక్కన బెడితే గురువారం హరిక్రిష్ణ రాజీనామాతో చంద్రబాబు సినిమా ‘ ఆత్మగౌరవ యాత్ర’ మాత్రం వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: