అన్న క్యాంటీన్లు పేరిట చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటం చేసినా దాని వైపు నిరు పేదలు, కూలీలు కన్నెత్తి అయినా చూడడం లేదు. చాల చోట్ల క్యాంటీన్లు పెట్టిన సంగతి కూడా రోజు వారీ పనులు చేసుకునే వారికి తెలియదు. జన్మ భూమి కమిటీల మాదిరిగానే అవి కూడా పచ్చ చొక్కాల వారి చేతులలోనే చిక్కిపోయాయి. పేదల కడుపు నింపే బ్రహ్మాండమైన స్కీం అంటూ ఊదరగొట్టడమే కానీ వారికి పట్టెడన్నం దొరికితే ఒట్టు.


టైమింగ్ పెద్ద చిక్కు :


ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర అల్పాహారమంటున్నారు. మధ్యాహ్నం భోజనం పన్నెండున్నరకే మొదలెట్టేస్తున్నారు, సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది మళ్ళీ మీల్స్ నిజానికి ఈ టైం కూలీలకు అసలు సరిపడడంలేదు. దాంతో వారు తొంగి చూసిన పాపాన పోవడం లేదు. చిల్లర వ్యాపారం చేసుకునే వారు సైతం తమ భోజనం వెంట తెచ్చేసుకుంటున్నారు. అక్కడ క్యూ కట్టాలంటే గంట బేరాలు వొదిలేయాలంటున్నారు. 


భోక్తలు వేరే :


లక్షాన్ని చేధించలేని స్థితిలో అన్న క్యాంటీన్లు  ఉన్నాయి. టీడీపీ వారు ఓపేన్ చేయడమే కాదు. అక్కడ వారి బేనర్లు, జెండాలు పెట్టేసి పూర్తిగా పొలిటికల్  క్యాంటీన్లుగా చేసేశారు. చాల చోట్ల వారి పర్యవేక్షణలోనే నడచిపోతున్నాయి. భోజనం చేయలంటే ఎన్నో రూల్స్, టోకెన్లు ఎపుడిస్తున్నారో ఎవరికీ తెలియదు, ఇలా తొలి వారం షో నడిచింది. రాజకీయంగా నాలుగు ఓట్లు దండుకునేందుకే  ఈ స్కీం అంటూ సెటైర్లు పడుతున్నాయి. నిజానికి బాబు సర్కార్ కి చిత్త శుధ్ధి ఉంటే నాలుగేళ్ళ మునుపే ఓపెన్ చెయాల్సిందని, అదీ కూదా పచ్చ చొక్కాల ప్రమేయం లేకుండా నడపాల్సిందని విపక్షాలు సైతం కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: