నిజంగా ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌య‌మే. సోష‌ల్ మీడియా అన్న‌ది రెండు వైపులా ప‌దునున్న క‌త్తి లాంటిద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.  సోష‌ల్ మీడియా ద్వారా ఎంత తొంద‌ర‌గా ఫేమ‌స్ అయిపోవ‌చ్చో అంతే తొంద‌ర‌గా గ‌బ్బు ప‌డ‌తారు. ఇపుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలో జ‌రిగింద‌దే. ప‌వ‌న్ త‌ల్లిపై ఎవ‌రో సోష‌ల్ మీడియా అస‌భ్య‌క‌ర‌మైన పోస్టింగులు పెట్టటం పెద్ద దుమారాన్నే రేపుతోంది.

అస‌భ్య‌క‌ర‌మైన పోస్టులు

Image result for PAWAN KALYAN MOTHER PHOTO MORPHING

ప‌వ‌న్ త‌ల్లి ఫొటోల‌ను ఎవ‌రో మార్ఫింగ్ చేసి అస‌భ్యంగా  ట్వ‌ట్ట‌ర్ లో పెట్టటం క‌ల‌క‌లం రేపుతోంది. చంట‌బ్బాయ్ అనే ట్విట్ట‌ర్  ఖాతా నుండి ఫొటోలను ఎవ‌రో  అప్ లోడ్ చేసిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు.  ఆ పొటోల‌ను శ్ర‌వ‌ణ్ అనే వ్య‌క్తి చూసి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌టంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసుల స‌మాచారంతో రంగంలోకి దిగిన సైబ‌ర్ పోలీసులు ఐడిని  బ్లాక్ చేసిన‌ట్లు స‌మాచారం.


ఫిర్యాదు చేస్తే ద‌ర్యాప్తు

Image result for cyber crime police logo

కాక‌పోతే ఎవ‌రైనా త‌మ‌కు రాత‌మూల‌కంగా ఫిర్యాదు చేస్తేనే కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేయ‌గ‌ల‌మ‌ని పోలీసులంటున్నారు. మ‌రి, పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన వ్య‌క్తే ఫిర్యాదు చేస్తారా ?  లేక‌పోతే జ‌న‌సేన త‌ర‌పున ఇంకెవ‌రైనా ఫిర్యాదు చేస్తారా అన్న‌ది తేల‌లేదు. మొత్తం మీద ప‌దే ప‌దే ప‌వ‌న్ త‌ల్లిని సోష‌ల్ మీడియాలో టార్గెట్ చేయ‌టం మాత్రం క్ష‌మించ‌రాని నేర‌మే. 


మరింత సమాచారం తెలుసుకోండి: