నెల్లూరులో శుభకార్యానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నందమూరి హరికృష్ణ మరణవార్త రెండు తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. హరికృష్ణ తెలుగు సినిమారంగంలో రాజకీయరంగంలో తనకంటూ గుర్తింపు స్థానాన్ని దక్కించుకున్నారు. తండ్రి దివంగత ఎన్టీఆర్ రాజకీయాల లో ఉన్న సమయంలో చైతన్య రధాన్ని నడిపి తండ్రి విజయంలో కీలకపాత్ర పోషించారు హరికృష్ణ.

Related image

అయితే హరికృష్ణ రాజకీయాలలో క్రియేట్ చేసిన ఓ రికార్డ్ ని ఇప్పటివరకు ఎవరూ పగల గోట్టలేదు. అప్పట్లో రాజకీయాల్లో ఉన్న సమయంలో అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్లో 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో హరికృష్ణ 62వేల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్ధి లక్ష్మీనారాయణరెడ్డిపై విజయం సాధించారు. ఈ రికార్డును ఇంతవరకు ఎవరూ కూడ ఇంకా బ్రేక్ చేయలేదు. ఆ సమయంలో 1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం చోటు చేసుకుంది.

Image may contain: 1 person, smiling

ఈ క్రమంలో టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ న్యూ ముఖ్యమంత్రి స్థానం నుండి దించేసి ఆయన అల్లుడు చంద్రబాబు సీఎం పదవిని అధిష్టించారు. అయితే ఆ సమయంలో చంద్రబాబునాయుడు వైపున హరికృష్ణ నిలిచారు. 1996 జనవరి 18వ తేదీన  ఎన్టీఆర్ మరణించారు. అప్పట్లో 1994లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు.

Image result for harikrishna

తర్వాత 1996లో ఎన్టీఆర్ మరణించిన నేపథ్యంలో హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున హరికృష్ణ నిలబడి ఈ 62వేల భారీ మెజార్టీని సాధించారు. చరిత్రను గమనిస్తే హిందూపురం నియోజకవర్గం ఎప్పటి నుండో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అంటారు చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఏదిఏమైనా హరికృష్ణ రాజకీయాల్లో తనకంటూ చరిత్ర రాసుకొని ...ఈ లోకాన్ని విడిచి శాశ్వత లోకానికి  వెళ్లిపోయారు. హరికృష్ణ మృతితో నందమూరి అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో బాధ పడుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: