దసరా అంటే అతి పెద్ద పండుగా. పది రోజుల పాటు విందులు, వినోదాలు. అంతా సందడే సందడి. రేపటి (బుధవారం) నుంచి మొదలవుతున్న దసరా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆనందాన్ని ముంగిట్లోకి తెచ్చేసింది. లోగిళ్ళన్నీ ముస్తాబై దసర వేడుకలకు రెడీ అంటున్నాయి. పచ్చని తోరణాలు, పట్టు పరికిణీలు...ఒకటే ముచ్చటగా దసరా హడావుడి సాగిపోతోంది.


అమ్మల గన్న అమ్మ :


ఏపీలో బెజవాడ కనకదుర్గమ్మ కోవెల దసరా కోసం తయారైపోయింది. బుధవారం నుంచి పది రోజులు ఆలయలో అమ్మ వారిని దర్శించుకునే భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏపీ, తెలంగాణాల నుంచి స్పెషల్ గా బస్సులను నడుపుతున్నారు. ఆలయంలో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా  అమ్మ వారికి ప్రతీ రోజు విశేష అలంకరణలు చేస్తారు.


శ్రీ స్వర్ణ కవచాలంక్రుతగా :


ఆశ్వీయుజ మాసం శుద్ధ పాడ్యమి శుభ వేళ అమ్మ వారి దసర ఉత్సవాలు ఇంద్ర కీలాద్రిపై వీభవంగా ప్రారంభమవుతున్నాయి. అమ్మ వారి శ్రీ స్వర్ణ కవచాలంక్రుతగా భక్తులకు దర్శ్నమిస్తారు. ప్రతీ రోజు ఒక్కో అవతారంతో భక్తులను చల్లగా చూసే కనక దుర్గమ్మ చివరి రోజున మహిషాసుర మర్ధనిగా, శ్రీ రాజరాజేశ్వరిగా కనిపించి దుష్ట శిక్షణ చేస్తుంది.


ఇంద్ర కీలాద్రిపైన:


విజయవాడ అంటేనే విజయాలకు చిహ్నం. అమ్మ వారు రాక్షసులను వధించి నాటి యుగంలో జనులందరికీ ప్రశాంతతను, అభయాన్ని కలిగించారు. అమ్మ ఇంద్రకీలాద్రిపై వెలసి అన్ని యుగాలాను, జగాలను అక్కడ నుంచ పాలిస్తున్నారు.  ఆ తల్లి కరుణా కటాక్షం కోసం తెలుగు రాష్ట్రాల నుంచె కాదు, దేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు.
అమ్మ వారు నక్షత్రమైన మూల తిధి రోజున భక్తులు పోటెత్తుతారు.


ఆ రోజున మూడు లక్షల వరకూ భక్త జనం రావచ్చునని అంచనా వేస్తున్నారు. ఇక విజయదశమి రోజున ఎకంగా మూడు నుంచి నాలుగు లక్షల మంది దర్శనానికి వస్తారని లెక్కలు వేస్తున్నారు. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నట్లుగా కనక దుర్గమ్మ ఆలయ అధికరులు తెలియచేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: