ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఐటి..ఈడి సంస్థలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులైన ఇళ్లపై వారి కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించడంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం చేసినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ విధంగా వేధిస్తారా అంటూ మోడీ పై ప్రశ్నల వర్షం కురిపించారు నారా లోకేష్. ఆనాడు విభజన చట్టంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను పార్లమెంటులో మిమ్మల్ని ప్రశ్నించినందుకు మాకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్.

Image result for nara lokesh

ముఖ్యంగా సీఎం రమేష్ ఆస్తులపై కార్యాలయాలపై ఐటీ దాడులు చేయడం కక్షసాధింపు చర్యగా పేర్కొన్నారు నారా లోకేష్. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం వంద రోజులు దీక్ష చేసిన సీఎం రమేష్ ఇంటిపై ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని తప్పు పట్టారు లోకేష్. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే ఐటీ దాడులు చేయిస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.

Related image

ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెనక్కి తగ్గేది లేదని.. కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో లోకేష్ అన్న మాటల పై ఏపీ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు...అసలు ఆనాడు మెడలు వంచకుండానే కేంద్ర ప్రభుత్వం కాళ్ల దగ్గర నీ తండ్రి మా ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు బొక్క బోర్లా పడి నమస్కారాలు చేసి స్పెషల్ ప్యాకేజీ సరిపోతుంది అని అన్నారు అనడంలో వాస్తవం లేదా..?..

Related image

ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని పేర్కొనడంతో..ఇప్పుడు మా వైపు మాట్లాడుతూ దొంగ రాజకీయాలు చేస్తున్నారంటూ నారా లోకేష్ పై సంచలన కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు రాష్ట్రం ఇలా అవడానికి గల కారణం మీరే అంటూ మీ నిర్ణయాలే అంటూ చంద్రబాబుని తెలుగుదేశం పార్టీ నాయకులను మరియు నారా లోకేష్ ని సోషల్ మీడియాలో నెటిజన్లు కడిగి పారేస్తున్నారు. తప్పు చేయని వారు ఎందుకు భయపడుతున్నారు అంటూ నారా లోకేష్ ని ప్రశ్నిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: