విశాఖపట్నం విమానాశ్రయంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి అధికార టిడిపి, పోలీసులు మసిపూసి మారేడుకాయను చేయాలని చూస్తున్నారు. జరిగిన ఘటనలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విమానాశ్రయంలో ఘటన జరిగింది కాబట్టి తమకు సంబంధం లేదని రాష్ట్ర పోలీసులు తప్పించుకుంటున్న విషయం అర్ధమైపోతోంది. విమానాశ్రయంలో ఘటన జరిగింది కాబట్టి తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటున్న పోలీసులు. మరి శ్రీనివాస్ బయటనుండే కదా విమానాశ్రయంలోకి వచ్చింది. విమానాశ్రయం బయటనుండి లోపలకు వస్తున్నపుడు చెక్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులకు లేదా ?

 

పైగా ప్రణాళిక ప్రకారమే శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడ్డాడని డిజిపి చెప్పటం విచిత్రంగా ఉంది. అందులోను శ్రీనివాస్ జేబులో ఎనిమిది పేజీల ఉత్తరం దొరికిందని డిజిపి చెప్పటం మరింత విచిత్రంగా ఉంది. నిజంగానే అతని జేబులో ఎనిమిది పేజీల ఉత్తరం దొరికితే వెంటనే దాన్ని మీడియా ముందుంచవచ్చుకదా ? అప్పుడు అందులో ఏముందో తేలిపోతుంది కదా ? ఆ పనిచేయకుండానే శ్రీనివాస్, జగన్ అభిమానని, వైసిపి పార్టీకి చెందిన వాడని, ప్రచారం కోసమే హత్యాయత్నానికి పాల్పడ్డాడని చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేయటం వారి ఆలోచనా స్ధాయికి అద్దం పడుతోంది.


మరోవైపేమో శ్రీనివాస్ పనిచేస్తున్న క్యాంటిన్ తెలుగుదేశంపార్టీకి చెందిన నేతదంటూ వైసిపి వాళ్ళు ఎదురుదాడి మొదలుపెట్టారు. క్యాంటిన్ టిడిపికి చెందిన నేతదై ఉండొచ్చు. అంతమాత్రాన టిడిపి నేత శ్రీనివాస్ తో చెప్పి జగన్ పై దాడి చేయించాడని అనేందుకు లేదు. కానీ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగితేనే కదా వాస్తవాలేంటో బయటపడేంది. ఇంకా దర్యాప్తు జరపకుండానే పోలీసులు ప్రధమిక దర్యాప్తంటూ చెబుతున్న మాటలే చివరకు దర్యాప్తు పూర్తయిన తర్వాత తేలిందిదే అంటూ కేసును క్లోజ్ చేసినా చేసేస్తారనటంలో సందేహమే లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: