జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం ఘటనలో చంద్రబాబునాయుడు ఇరుక్కున్నట్లే కనిపిస్తోంది. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ కేసు విచారణకు చంద్రబాబు సిట్ ను నియమించారు. సిట్ విచారణపై తమకు నమ్మకం లేదంటూ థర్డ్ పార్టీ విచారణకు జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు హై కోర్టులో కేసు కూడా వేశారు.  జగన్, ప్రభుత్వం తరపున లాయర్ల వాదనలు విన్న న్యాయమూర్తి జగన్ పిటీషన్ పై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ చంద్రబాబు, ఏపి ప్రభుత్వం, సిట్ , కేంద్రప్రభుత్వం, విమానాశ్రయ ఉన్నతాధికారులు, సిఐఎస్ఎఫ్ లకు నోటీసులిచ్చింది.

 

ఇక్కడే చంద్రబాబు బాగా ఇరుక్కున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం సమాధానం ఇవ్వలంటే ఏమని సమాధానం ఇవ్వాన్నదే అసలైన సమస్య. హత్యాయత్నం జరిగిందని అంగీకరించాలా ? లేకపోతే జరిగిందంతా కేవలం డ్రామా అనే చెప్పాలో తెలీటం లేదు. ఎందుకేంట, హత్యాయత్నం ఘటన జరిగిన గంటలోపే చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పై జరిగిన దాడిని డ్రామాగా కొట్టి పారేశారు. జగన్ పై జరిగిన దాడి ఘటనను ఘటనగా చూడకుండా రాజకీయానికి తెరలేపింది చంద్రబాబే. దాంతోనే రాజకీయంగా పెద్ద దుమారం రేగి దేశవ్యాప్తంగా సంచలనమైంది.

 

సరే, వ్యక్తిగతం ఎలాగున్నా ఇపుడు కోర్టుకు ఏమని సమాధానం ఇవ్వాలి ? జరిగిన దాడి కేవలం డ్రామా అని అంటే అందుకు తగ్గ ఆధారాలు చూపించాలి. లేదూ జరిగింది హత్యాయత్నమే అని ఒప్పుకుంటే అప్పట్లో చేసిన ప్రకటనకు సమాధానమిచ్చుకోవాలి. అదే సమయంలో జగన్ డిమాండ్ మేరకు థర్డ్ పార్టీ విచారణకు ఎందుకు ఒప్పుకోవటం లేదో  సమాధానం చెప్పుకోవాలి. ఒకసారంటూ కోర్టుకు సమాధానమిస్తే అందుకు కట్టుబడుండాల్సిందే. అందుకనే ఏమని సమాధానం ఇవ్వాలో తేల్చుకోలేక అవస్తలు పడుతున్నారు. ఈరోజు సమాధానం ఇవ్వకపోవటంపై ప్రభుత్వాలపై కోర్టు బాగా సీరియస్ అయ్యింది. సోమవారం లోగా సమాధానం ఇవ్వాలని తాజాగా ఆదేశిస్తూ విచారణను కూడా సోమవారానికి వాయిదా వేసింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: