తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ది దిశగా సాగుతుంది.  ఇక్కడ విదేశీ కంపెనీల పెట్టుబడులతో ఎంప్లాయ్ మెంట్ సౌకర్యం కలుగుతుంది.  అభివృద్ది సంక్షేమ పథకాలతో ప్రగతిపథంలో ముందుకు వెళ్తుంది.  తాజాగా  తెలంగాణకు కేంద్రం శుభవార్త తెలిపింది. 1028 కోట్ల రూపాయల ఖర్చుతో బీబీనగర్‌లో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి స్వస్థి సురక్ష యోజన కింద ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 


మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. 15-20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకలతో ఎయిమ్స్ ఏర్పాటు కానుంది. ఎయిమ్స్ లో 1500 ఓపీ, 1000 మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందే అవకాశముంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తెలంగాణకు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)ను కేటాయించాలని నిర్ణయించింది.  రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీబీనగర్‌లో నిమ్స్ కోసం నిర్మించిన భవన సముదాయంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడీ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది.

Image result for kcr pm

ఎయిమ్స్ లో ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు ఉండనున్నాయి. మెడికల్ కాలేజీ సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీల కృషి మేరకు ఇటీవలే రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: