దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి కొడుకు హితేష్ చెంచురామ్ తొందరలో వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయటానికి చెంచురామ్ రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ  చేయాలనే విషయంలో ఇంతకాలం తేల్చుకోలేదు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో ఇంకా రాజకీయ అరంగేట్రంపై నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బందవుతుదన్న ఉద్దేశ్యంతో ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో వైసిపి తరపున పర్చూరు అసెంబ్లీకి పోటీ చేయాలని దగ్గుబాటి హితేష్ నిర్ణయించుకున్నారు.

 

 ఇక్కడ చెంచురామ్ అంటే దగ్గుబాటి పురేంధేశ్వరి అనే అర్ధం. ఎందుకంటే, దగ్గుబాటి కుటుంబంలో రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్నది పురంధేశ్వరి మాత్రమే. దగ్గుబాటి కుటుంబంలో పురంధేశ్వరిదే అంతిమ నిర్ణయం. అందులో భాగంగానే కొడుకును వైసిపి తరపున పోటీ చేయించాలని పురంధేశ్వరి నిర్ణయించినట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఈమధ్యనే వైసిపి అధ్యక్షుడు  జగన్మోహన్ రెడ్డి తో కూడా ఇదే విషయమై దగ్గుబాటి కుటుంబం తరపున కావాల్సిన వారు మాట్లాడినట్లు తెలిసింది.

  

దగ్గుబాటి కుటుంబం వైసిపిలోకి వస్తే అభ్యంతరాలు ఏమీ లేవని జగన్ కూడా సానుకూలంగా స్పందించారట. దాంతో చెంచురామ్ కు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్న బాలినేని శ్రీనివాసులరెడ్డితో  దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆమధ్య భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. బాలినేని ద్వారానే దగ్గుబాటి కుటుంబం వైసిపిలోకి వెళ్ళటానికి లైన్ క్లియర్ అవుతోందని వినికిడి. దగ్గుబాటి కుటుబం టిడిపిలోకి వెళ్ళే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ ను కూడా పురంధేశ్వరి మరచిపోయినట్లే. కాంగ్రెస్ కు సమీప భవిష్యత్తులో బ్రతుకు లేదని తేల్చుకున్నాకే పురంధేశ్వరి బిజెపిలోకి జంప్ చేశారు.

 

అయితే, బిజెపికి కాంగ్రెస్ కు పెద్ద తేడా ఏమీ కనబడటం లేదు. దాంతో బిజెపిలో ఉండి కూడా ఉపయోగం లేదని పురంధేశ్వరికి అర్ధమైపోయిందిట. అందుకనే వచ్చే ఎన్నికల్లో బిజెపి తరపున పురంధేశ్వరి పోటీ చేసేది కూడా అనుమానమే. తను పోటీ చేసేదే అనుమనైపుడు ఇక కొడుకు రాజకీయ ఎంట్రీ మాత్రం బిజెపి తరపున ఎలా చేయిస్తారు ? అందుకనే వైసిపిని ఆప్షన్ గా ఎంచుకున్నారట. ముందు కొడుకు చెంచురామ్ పోటీ విషయం ఫైనల్ అయిపోతే తర్వాత తాను కూడా వైసిపిలో చేరే విషయంలో నిర్ణయం తీసుకుందామని పురంధేశ్వరి వెయిట్ చేస్తున్నారట. తెలంగాణా ఎన్నికల్లో బిజెపి దారుణ ఓటమిని చూసిన తర్వాత ఏపిలో కూడా నేతలకు ఆశలు ఆవిరైపోయాయి. అందుకే పక్క చూపులు చూస్తున్నారు.

 

 అందులో భాగంగానే వైసిపిని ఆప్షన్ గా పెట్టుకుంటున్నారు. విజయవాడ నుండి ఎంపిగా పోటీ చేయటానికి ఇఫుడు వైసిపి తరపున సరైన అభ్యర్ధి లేరు. పురంధేశ్వరి గనుక వైసిపిలో చేరితే విజయవాడ ఎంపి క్యాండిడేట్ అయ్యే అవకాశాలను కొట్టేయలేం. అదే సమయంలో ఒంగోలు ఎంపిగా కూడా పోటీకి అవకాశం ఉంది. ఒంగోలు ఎంపి అయితే పర్చూరు అసెంబ్లీపైన కూడా దృష్టి పెట్టవచ్చు. అదే విజయవాడ ఎంపి అయితే మళ్ళీ రెండు నియోజకవర్గాలపైన దృష్టి పెట్టటం అంత ఈజీ కాదు. మరి దగ్గుబాటి ఆలోచనలు ఎలాగున్నాయో తొందరలోనే తెలిసిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: