కొత్త ఏడాది చూస్తూంటే చాలా మార్పులు తీసుకువచ్చేట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి జాతీయస్థాయిలోనూ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎన్నికల ఏడాది. ప్రజలే మారాజులుగా మారే ఏడాది. ఓటు అనే ఆయుధం జనం చేతిలోకి వస్తున్న సందర్భం ఇది. ఇంతకాలం మేమే రాజులని ఫోజులు కొట్టిన వారందరినీ తరాజులుగా మార్చబోయే ఏడాది 2019.


ఇదీ పరిస్థితి :


ఇక ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే ఏపీలో రాజకీయం ఎలా ఉండబోతోందో అనేక సర్వేలు చెబుతున్నాయి. ఎన్ని కలకు నాలుగు నెలల సమయం ఉందనగానే రాజకీయం వేడి రాజుకుంటోంది. ఏపీలో మూడు ప్రధానమైన ప్రాంతాలు ఉన్నాయి. అందులో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలను విభజించి చూసుకుటే సీమలోని నాలుగు జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. గట ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ సీట్లను కైవశం చేసుకున్న వైసీపీ ఈసారి కూడా ప్రభంజనం స్రుష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో గతసారి అనంతపురం టీడీపీకి కొమ్ము కాసింది. ఇపుడు మారిన వాతావరణంలో అక్కడ కూడా వైసీపీ బలంగా మారే చాన్స్ ఉంది.


కోస్తాలో పెరిగిన బలం :


ఇక చూసుకుంటే కోస్తా జిల్లాలుగా చెప్పుకుంటున్న ప్రకాశం, నెల్లూరు, క్రిష్ణ, గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ బాగా స్కోర్ చేసింది. మెజారిటీ సీట్లను ఆ పార్టీ తన ఖాతాలో వేసుకుని అధికారం దక్కించుకుంది. ఈసారి మాత్రం పోటా పోటీగా ఉండే పరిస్థితి ఉండబోతోంది. ఇక గోదావరి జిల్లాల్లో గాలి ఎటుమళ్ళితే ఆ పార్టీ గెలిచి తీరుతుందన్న సెంటిమెంట్ ఉంది. దానికి తగినట్లుగా ఈసారి గోదారి వాతావరణం చాలా మారిందంటున్నారు. అది టీడీపీకి చేటు తెస్తే ప్లస్ ఎవరికి అన్నది చూడాలి, ఓ వైపు జనసేన, మరో వైపు వైసీపీ కూడా పోరాడుతున్నాయి. మరి గోదారి ఓటరు ఎలాంటి తీర్పు ఇస్తాడో చూడాలి.


ఉత్తరాంధ్రాలో టీడీపీదే :


ఇక చివరిగా చెప్పుకుంటే ఇప్పటికి కూడా ఉత్తరాంధ్రాలో అధికార టీడీపీ బలం చెక్కుచెదరలేదు. బలమైన పార్టీగా ముద్ర వేసుకుని కొనసాగుతోంది. ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా వైసీపీ పుంజుకోలేకపోతోంది. అలాగే, కొత్తగా వచ్చిన జనసేన కూడా ఏమంత ప్రభావం చూపించలేకపోతోంది. మొత్తానికి మంత్రులు సామంతులతో అన్ని విధాలుగా అండదండలతో టీడీపీ దూసుకుపోతోంది. రేపటి ఎన్నికల్లో కొద్దో గొప్పో సీట్లు తగ్గినా మెజారిటీకి వచ్చిన ఢోకా మాత్రం లేదన్నది చెప్పకతప్పదు. ఇక స్తూలంగా చూసుకుంటే ఏపీలో ఏపీలో మూడు ప్రాంతాలూ తలో విధంగా ఉండడం వల్ల రేపటి ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ సీట్లు దక్కి అధికారం చేపడతారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికైతే పూర్తిగా ఇదే వాతావరణం కనిపిస్తోంది. పూర్తి చిత్రం ఈ కొత్త ఏడాది చూపిచబోతోంది. ఇవే సమీకరణలు ప్రభావం చూపించి జాతీయ స్థాయిలోనూ భారీ మార్పులు సంభవించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: