2019 లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇటు అధికార పార్టీ అయినా బీజేపీ మరియు ప్రతి పక్ష కూటమికి మధ్య హోరాహారీ ఎన్నికల సమరం తప్పదు. అయితే ఎన్నికల ముందు వస్తున్న బడ్జెట్ కావడం తో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. సాధారణంగా ఏ అధికార పార్టీ అయినా ఎన్నికల కు వెళ్లే ముందు బడ్జెట్ ను చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేస్తుంది. అయితే పోయిన బడ్జెట్ లో ఆదాయపు పన్ను పరిమితి ని 4,00,000 లకు పెంచిన సంగతి తెలిసిందే. 


బడ్జెట్ 2019 : సామాన్య ప్రజలకు పండగేనా ...!

ఈ సారి కూడా ఆదాయపు పన్ను పరిమితి ని పెంచాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఎన్నికల ముందు ఉద్యోగుల ఓట్లు కొల్ల గొట్టటానికి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవచ్చని చాలా మంది ఆశిస్తున్నారు. అదే నిర్ణయం తీసుకుంటే చాలా మందికి టాక్స్ భాద తప్పిపోతుంది. అయితే బడ్జెట్ గురించి తీవ్ర వ్యతిరేకత వస్తే మాత్రం అది ఎన్నికల మీద ఎంతో కొంత ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల ను దృష్టి లో పెట్టుకొని అగ్ర వర్ణాల కులాల వారికి 10 % రిజర్వేషన్ కల్పించిన సంగతి తెలిసిందే. ఇది ఎన్నికల కోసమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 


బడ్జెట్ 2019 : సామాన్య ప్రజలకు పండగేనా ...!

అయితే మోడీ ఓటర్లను ఆకట్టుకోవడానికి బడ్జెట్ ను మధ్య తరగతి,  సామాన్య ప్రజలను అన్ని వర్గాల వారి ఓట్లు సంపాదించడానికి బడ్జెట్ ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా సామాన్య ప్రజలకు , అలాగే వ్యవసాయానికి , అసంఘటిత వ్యాపారులకు వరాల జల్లు తప్పదని తెలుస్తుంది. అలాగే యువతకు ఉద్యోగ కల్పనకు బడ్జెట్ ను భారీగా కేటాయించవచ్చని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: