రాజకీయాలు మాస్ కాదు, క్లాస్ కూడా. కొన్ని సార్లు బహు సున్నితంగా ఉంటాయి. జాగ్రత్తగా డీల్ చేయకపఒతే అసలుకే ఎసరు వస్తుంది. అందువల్ల కరకుగా ఉన్న చోట గట్టిగానూ, సౌమ్యంగా ఉండాలసిన చోట మెత్తగానూ వ్యవహరించాలి. ఇక ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటామంటున్నా హఠాత్తుగా వేలు పెట్టి కదపాలనుకుంటే డేంజరే మరి.


సిట్టింగులు హ్యాపీ :


టీడీపీ అధినేత చంద్రబాబు మాటలకు చాలా చెబుతారు. చేతల్లో మాత్రం పెద్దగా ఉండవని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు అంటారు. ఇక సొంత పార్టీ వ్యవహారాల్లోనూ ఇదే చేస్తున్నారని ఆశావహులు గగ్గోలు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపుగా 50 సీట్లలో సిట్టింగులను పక్కన పెడతామని బాబు నిన్నటి వరకూ చెబుతూ వచ్చారు. ఇపుడు చూడబోతే వారికే పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎక్కడా సిట్టింగులకు నో అనకుండా అసలు ఆ  వూసే లేకుందా వారికే టికెట్లు ఇచ్చేసుకుంటూ బాబు సేఫ్ గేం ఆడుతున్నారని అంటున్నారు.


లాభమేనా :


దీనివల్ల లాభమా అంటే పార్టీ వరకూ లాభమే కానీ జనాల్లో ఉన్న వ్యతిరేకత ఎలా తగ్గుతుందన్నది చూడాల్సివుందంటున్నారు. ఈ మధ్యన వరసగా సిట్టింగు ఎమ్మెల్యేలు కొందరు టీడీపీని వీడిపోవడంటో కంగారు పడిన హై కమాండ్ వారికే టికెట్లు ఇస్తూ పార్టీ నుంచి పోకుండా చూసుకుంటోందట. ఇది బాగానే ఉన్నా జనంలో బాగా నెగిటివిటీ ఉన్న వారికి టికెట్లు ఇస్తే గెలుస్తారా అని ఆ సీటు మీద ఆశలు పెంచుకున్న ఆశావహులు గుర్రుమంటున్నారు.


 పని తీరు బాగాలేని వారిని  చాలామందిని తప్పిన్నామని నిన్నటి వరకూ  చెప్పిన బాబు  ఇపుడు వరసగా వారికే పిలిచి పెద్ద పీట వేయడంతో ఆ సీటుపై మోజు పెంచుకున్న వారంతా ఇపుడు పార్టీలో కొత్త తలనొప్పిగా తయారయ్యారట. ఏది ఏమైనా ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతున్నారన్న సంకేతాలు జనంలోకి వెళ్తే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని బాబు ఇలా చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి సిట్టింగుల జోలికి వచ్చే సాహాసం మాత్రం  టీడీపీ అధినాయకత్వం చేయలేకపోయిందని కామెంట్స్ వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: