ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మార్పులు చేర్పులు కామన్ అయ్యాయి.  రాష్ట్రావతరణ తర్వాత అధికార పార్టీలోకి వైసీపీ ముఖ్యనేతలు వరుసగా వలస వెళ్లిన విషయం తెలిసిందే.  ఇప్పుడు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర తర్వాత ప్రజల్లో ఆయనపై నమ్మకం పెరిగిందని..వచ్చే ఎన్నికల్లో గెలుపు తధ్యం అని అంటున్నారు..పార్టీ శ్రేణులు.  దాంతో ఇప్పుడు గాలి జగన్ వైపు మళ్లడం..కొంత మంది నేతలు వైసీపీలోకి వలస రావడం జరుగుతుంది.  ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు వైసీపీ నుంచి ఆహ్వానాలొస్తున్నాయంటూ.. ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ విశాఖ సిటీ నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాడి వీరభద్రరావు టీడీపీ నుండి  వైసీపీలో చేరారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాలో పాదయాత్ర చేసే సమయంలో ఆయనతోనే ఉన్నారు..కానీ  కొన్ని రోజులకే దాడి వీరభద్రరావు టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దాడి వీరభద్రరావు వంటి సీనియర్ నేత , మూడు దశాబ్దాలపాటు తెలుగుదేశం పార్టీలో ఉండి, కాంగ్రెస్ ను, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వంటి వారిని తీవ్రంగా వ్యతిరేకించి అనూహ్యంగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వలస వెళ్లడంపై చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.  ఇదే సమయంలో ఆయనతో పాటు కొణతాల రామకృష్ణ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.   

మరి వారి మద్య ఏం జరిగిందో తెలియదు కానీ..కొంత కాలానికే ఇద్దరూ వైసీపీ పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు.  వైసీపీకి గుడ్ బై చెప్పేటప్పుడు.. దాడి వీరభద్రరావు చేసిన ఆరోపణలు గుర్తుంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను మరోసారి పార్టీలోకి తీసుకుటారని ఎవరూ అనుకోరు.  జగన్ పైన, లేదా వారి కుటుంబీకులపైన దాడి వీరభద్రరావు ఏకంగా ఒకటి,రెండు కాదు పదహారు లక్షల కోట్ల కుంభకోణం ఆరోపణ చేశారు. బయ్యారం గనులను దోచుకున్నారని ఈయన ఆరోపించారు.  ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావుతో ఉన్న స్నేహంతో.. ఆయనతో లాబీయింగ్ చేసుకుని టీడీపీలో చేరాలని తీవ్రంగా ప్రయత్నించారు.
Image result for ysrcp
కళా వెంకటరావు పలుమార్లు ఈ విషయంపై చంద్రబాబుతో చర్చించారు. కానీ.. విశాఖ విషయంలో చంద్రబాబు ఎదుట చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే.. ఏ విషయాన్ని తేల్చి చెప్పలేదు.  దాంతో ఆయన మళ్లీ వైసీపీలోకి చేరాలనే నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఈ సమయంలో దాడిని వైసీపీలోకి తీసుకోవడం అవసరమా అని కొంత మంది పార్టీ శ్రేణులు అభ్యంతరాలు చెప్పిన సందర్భాలు కూడా తెరపైకి వస్తున్నాయి.  మరి దాడి వల్ల వైసీపీ ఎంత వరకు లాభం ఉంటుందో..నష్టం జరుగుతుందో ముందు ముందు చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: