వైఎస్ కుటుంబాన్ని కడప కడుపులో పెట్టుకుంది. కడపను వైఎస్ కుటుంబం కూడా అంతే స్థాయిలో అక్కున చేర్చుకుంది. ఇది దశాబ్దాలుగా విడదీయని బంధం. వైఎస్ అంటే కడప అన్నంతగా రాజకీయం చేశారు. ప్రజల అభిమానం సంపాదించారు. వైఎస్సార్ కి అన్నింటా వెన్నటి ఉన్నది ఆయన తమ్ముడు వివేకానందరెడ్డి.


వివేకానందరెడ్డి ఉంటే చాలు వైఎస్ కి అదో ధీమా. అన్న ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎంపీగా ఢిలీలో ఉన్నా పీసీసీ చీఫ్ గా జనంలో ఉన్న పులువెందుల్లో ఉన్నది వివేకా మాత్రమే. మొత్తం ప్రజలతో నేరుగా సంబంధాలను కొనసాగిస్తూ వైఎస్సార్ నీడగా అన్నీ చక్కబెట్టేవారు. ఆ విధంగా వైఎస్సార్ కి  కుడి భుజంగా మారారు.


ఇక వైఎస్సార్ చనిపోయాక కొన్నాళ్ళు కాంగ్రెస్ లో ఉన్న తరువాత జగన్ వైపుగా వచ్చేశారు. జగన్ కి వెన్నుదన్నుగా ఉంటూ తనదైన రాజకీయ అనుభవాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇక ఈ రోజు ఉదయం చనిపొయేంతవరకూ కూడా వివేకా తనకు అప్పగించిన బాధ్యతను కచ్చితంగా చేసి చూపించారు. నిన్న రాత్రి కడప జిల్లా మైదుకూర్లో ఎన్నికల ప్రచారం చేసి తన అఖరి కర్తవ్యం కూడా నెరవేర్చారు. మొత్తానికి చూసుకుంటే వైఎస్సార్ లేని జగన్ కి చిన్నాన్న అండగా నిలిచారు. ఇపుడు ఆయన దూరం కావడం నిజంగా షాకే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: