ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాలు మరీ వేడీ వాడిగా నడుస్తున్నాయి.  ఏ నాయకులు ఏ పార్టీలు ఉంటారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.  మొన్నటి వరకు ఆయన టీడీపీ తరుపున భీమిలి నియోజకవర్గం నుండి పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు రావటం చూశాం.  కానీ అందరి ఊహాగానాలకు తెర దింపుతు   సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా జనసేన పార్టీలో చేరడంతో ఆంధ్ర రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. ఇప్పుడు ముఖ్యమైన పార్టీలు తమ అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తున్న విషయం తెలిసిందే. 
Image result for జెడీ లక్ష్మీనారాయణ జనసేన
చివరి నిమిషంలో అభ్యర్థులు మార్పులు చేర్పులు చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం అర్ధరాత్రి ఏపీ శాసనసభలో బరిలోకి దిగబోతున్న మరో 13 మంది అభ్యర్థులతోపాటు ఓ లోక్‌సభ అభ్యర్థిని కూడా ప్రకటించారు. అలాగే ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలోని ఓ అభ్యర్థి స్థానాన్ని మార్చారు.  ఇక గిద్దలూరు నుంచి పోటీ చేస్తారని ప్రకటించిన షేక్ రియాజ్ ఒంగోలు నుంచి పోటీ చేయనుండగా, గిద్దలూరు నుంచి బైరబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌ పోటీ చేస్తారని పవన్ ప్రకటించారు.  తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్  మూడో జాబితా ప్రకారం ప్రకటించారు.

కణితి కిరణ్ కుమార్ (టెక్కలి), గుణ్ణం నాగబాబు(పాలకొల్లు), షేక్‌ జియాఉర్‌ రెహ్మాన్‌ (గుంటూరు తూర్పు), కమతం సాంబశివరావు (రేపల్లె), మిరియాల రత్నకుమారి (చిలకలూరిపేట), కె.రమాదేవి (మాచర్ల), పులుగు మధుసూదన్‌రెడ్డి ( బాపట్ల), షేక్‌ రియాజ్‌ (ఒంగోలు), ఇమ్మడి కాశీనాథ్‌ (మార్కాపురం), బైరబోయిన చంద్రశేఖర్‌యాదవ్‌ (గిద్దలూరు), ఇంజా సోమశేఖర్‌రెడ్డి (ప్రొద్దుటూరు), కేతంరెడ్డి వినోద్‌రెడ్డి (నెల్లూరు సిటీ), పందింటి మల్హోత్రా (మైదుకూరు), సాడగల రవికుమార్‌ (వడ్డే రవిరాజు-కదిరి), బెల్లంకొండ సాయిబాబా (ఒంగోలు -లోక్‌సభ)

మరింత సమాచారం తెలుసుకోండి: