హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి వైఎస్ కుటుంబంలో అరెస్టులు తప్పవా ? తాజాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే అందరిలోను ఇవే అనుమానాలు మొదలయ్యాయి. వివేకా హత్య విషయంలో వైఎస్ కుటుంబంపైనే నేరాన్ని నెట్టేసి తమ కుటుంబంలో కూడా అరెస్టులుంటాయని జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

 

పులివెందులలో నామినేషన్ వేసిన  సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి పెద్ద లీడర్లను అరెస్టులు చేయటానికి చంద్రబాబునాయుడు కుట్రలు పన్నినట్లు మండిపడ్డారు. రాబోయే మూడు రోజుల్లో పెద్ద నేతల అరెస్టుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్లుగా జగన్ ఆరోపించటం పెద్ద దుమారాన్నే రేపుతోంది. వివేకాను అధికార పార్టీ వాళ్ళే హత్య చేయించి అదే నేరాన్ని వైఎస్ కుటుంబంపై నెట్టేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.

 

ప్రభుత్వం ఏం చేసినా సంయమనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. బహుశా తాను మళ్ళీ ప్రచారం నిమ్మితం పులివెందులకు రాలేకపోవచ్చని కూడా అన్నారు. ఆ పరిస్ధితుల్లో ప్రతీ ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకుని వైసిపిని గెలిపించాలంటూ అభ్యర్ధించారు. కుట్రలు, కుతంత్రాలు తమకు కొత్తవి కావన్నారు. ప్రజాబలంతో అధికార పార్టీ కుట్రలను చేదిస్తామంటూ జగన్ చెప్పారు. నామినేషన్ సందర్భంగా వులివెందులలో జనాలు పోటెత్తారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: