జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఇటీవల నామినేషన్ వేసిన సందర్భం ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వివరించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆస్తుల వివరాలతో ఎక్కువగా అప్పులు ఉన్నట్లు తేలింది. దాదాపు 32 కోట్ల వరకు ఇతరులకు అప్పు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఇది చూసిన తర్వాత అభిమానులతో పాటు ప్రజలు కూడా షాక్ కావడం ఖాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అప్పుల్లో ఉన్నాడు. ఈయనకు అక్షరాలా 32 కోట్ల అప్పులున్నాయి. పైగా ప్రభుత్వానికి 56 లక్షలు డ్యూ ఉన్నట్లు చూపించాడు. నమ్మడానికి ఇది కాస్త కష్టమే అయినా కూడా ఇదే నిజం అంటున్నాడు పవర్ స్టార్.
మరియు అదే విధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు జనసేన పార్టీ తరఫున నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్ననేపథ్యంలో నామినేషన్ వేశారు. నామినేషన్ లో నాగబాబు తనతో పాటు తన భార్య పేరిట రూ.41 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. ఇందులో స్థిరాస్తులు రూ.4.22 కోట్లుగా ఉండగా, చరాస్తులు రూ.36.73 కోట్ల మేర ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఇద్దరి పేరుపై రూ.2.70 కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.