బాపట్ల లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వైసిపి అభ్యర్ధి నందిగం సురేష్ గతంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. పోలీసుల వేధింపులను తట్టుకోలేక, కేసుల నుండి బయటపడే దారిలేకే ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారట. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడటం వల్లే చనిపోదామని అనుకున్న నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ పోరాటాలు మొదలుపెట్టారట.

 

సురేష్ స్వయంగా పై విషయాలు చెప్పారు. మూడు పూటలా కడపునిండా తినేంత స్తోమత కూడా లేదట ఆయన కుటుంబానికి. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళల్లో చదువుకున్నారట. అలాంటిది ఏదో ఉద్యోగం చూసుకుని స్ధిరపడదామనే కాలంలో వైసిపిలో చేరాలని అనిపించిందట. వెంటనే చేరిపోవటం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం అన్నీ చకచక జరిగిపోయిందట.

 

అదే సమయంలో రాజధాని ప్రాంతంలో రైతుల పంటలు తగలబడ్డాయట. పంటలు తగలపడిన ఘటనను పోలీసులు వైసిపి నేతలపైకి నెట్టేశారని చెప్పారు. దాంతో ప్రభుత్వ, పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలుపెట్టారట. దాంతో పోలీసుల కళ్ళు తనపై పడ్డాయని సురేష్ చెప్పారు. అప్పటి నుండే పోలీసుల వేధింపులు మొదలయ్యాయట. అంతేకాకుండా ఎప్పుడుపడితే అప్పుడు పోలీసు స్టేషన్ కి పిలిపించి వేధించేవారట.

 

జగన్మోహన్ రెడ్డే అరటి తోటలను తగలబెట్టమని చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టారట. జగన్ కు వ్యతిరేకంగా చెబితే డబ్బులిస్తామని ఆశచూపారట. చెప్పినట్లు వినకపోతే కాల్చి చంపేస్తామని బెదిరించి తీవ్రంగా కొట్టారట. జైల్లో ఉన్నపుడు తనతో మాట్లాడటానికి తన బంధువులు, స్నేహితులు, ఊరివాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదట. అందుకనే  వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నారు.

 

ఆ సమయంలోనే జగన్ నుండి సురేష్ కు పిలుపొచ్చిందట. జగన్ ను కలవగానే బాపట్ల లోక్ సభ నియోకవర్గ సమన్వయకర్తగా నియమించినట్లు చెప్పటాన్ని తాను నమ్మలేదట. దాంతో ఆత్మహత్య ఆలోచనను విరమించుకుని పోరాటాలు మరింత ఎక్కువ చేశారట. ఆ పోరాటాల ఫలితమే ఇపుడు బాపట్ల లోక్ సభలో పోటీ అంటూ నందిగం సురేష్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: