ఈ రోజుతో ప్రచారానికి తెర పడనున్నది . అయితే జగన్ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిస్తే మంత్రి పదవిని ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారం చివరిరోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మంగళగిరిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈరోజు జగన్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రచారం చేయడంతో పాటు కర్నూలు జిల్లాలో ప్రచారం చేసి, ఆ తర్వాత చిత్తూరుజిల్లా తిరుపతిలో ప్రచార పర్వాన్ని ముగించనున్నారు. ఈ విధంగా జగన్ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది.


ఇక మంగళగిరి ఎన్నికల ప్రచార సభలో జగన్ ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా అనుసరించిన విధి విధానాలను ప్రస్తావించారు జగన్. రాజధాని ప్రాంతంలో జరిగిన దుర్మార్గాలను ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడి మోసపూరిత విధానాలను ప్రస్తావించారు. ప్రత్యేకహోదా విషయంలో బాబు యూటర్న్ లను ప్రస్తావించారు. రాష్ట్రానికి ఆయన మోసం చేశారని జగన్ ధ్వజమెత్తారు. అలాంటి బాబును సాగనంపాలని కోరారు.


ఇక మంగళగిరిలో లోకేష్ కు వ్యతిరేక ప్రచారానికి పవన్ కల్యాణ్ రాకపోవడాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. వారిద్దరూ పార్ట్ నర్స్  కాబట్టి ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారని జగన్ అన్నారు. అలాగే తమ పార్టీ హామీలను జగన్ మంగళగిరిలో ప్రస్తావించారు. నవరత్నాలు ప్రోగ్రామ్స్ ను వివరించారు. పిల్లలను బాగా చదివించుకోవాలనుకుంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇక మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చిన జగన్.. ఆయనను గెలిపిస్తే ఆయన తన కేబినెట్లో మంత్రి అవుతారని జగన్ వ్యాఖ్యానించడంతో ఈలలూ, కేకలతో ఆ ప్రాంతం మార్మోగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: