టెక్నాలజీ పెరిపోయింది..ప్రతి చిన్న విషయానికి మనిషి ఈ టెక్నాలజీ పై ఆధారపడుతున్నారు.  అయితే ఇది మంచికి ఉపయోగించే వారు కొందరైతే..చెడుకు ఉపయోగించే వారు చాలా మంది తయారయ్యారు.  డబ్బు సంపాదించడమే లక్ష్యంగా చేసుకొని చాలా మంది సైబర్ నేరాలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే.  ఇలాంటి నేరాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకుంటున్నా..ఫలితం మాత్రం శూన్యం.  ప్రస్తుతం భారత దేశంలో ఎన్నికల జోరు కొనసాగుతుంది. నిన్నటితో సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇప్పుడు నేతలందరూ పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించారు.

గెలుపు తమ వైపు ఎలాగైనా తిప్పుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  మరోవైపు, నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేసేందుకు గట్టి చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం కాస్మొటిక్ చేతి వేళ్లపై దృష్టి సారించింది. కొన్ని సార్లు ప్రమాదాల్లో వేలు పోగొట్టుకున్న వారు ఈ కాస్మొటిక్ చేతి వేళ్లను వాడుతుంటారు.  ఇప్పుడు నేరాలు చేసేవారు ఈ వేళ్లను ఉపయోగించుకొని దారుణాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నట్లు ఈసి గుర్తించింది.

సాధారణంగా వేలికి సిరా ముద్ర వేస్తారు..అయితే ఇలాంటి నకిలీ వేలు దరించిన వారు వెంటనే దాన్ని తొలగించి మరో ఓటు వేసే వీలు ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ కాస్మొటిక్ వేళ్ల గురించి విస్తృత ప్రచారం జరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు సిరాగుర్తు వేసే ముందు వేళ్లను గట్టిగా పట్టుకుని వేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: