ఏపీలో ఈసారి నువ్వా నెనా అన్న స్థాయిలో ఎన్నికల ప్రచారం జరిగింది. దాని ఫలితంగా అన్నట్లు గా పోలింగ్ స్టేషన్లు కూడా ఈ రోజు కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా పెద్ద క్యూలు కనిపిస్తూండడంతో ప్రజాస్వామ్య ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వోటర్లలో చైతన్యం వెల్లి విరిసిందని వారు అంటున్నారు.

 


సాధారణంగా పోలింగ్ కి జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారంటే అది గొప్ప మార్పునకు ప్రతీకగా రాజకీయ పరిశీలకు లు చూస్తారు. 2014 ఎన్నికల్లో దాదాపుగా 77 శాతం వరకూ పోలింగ్ జరిగింది. ఈసారి ఎన్నికల అధికారి ద్వివేది మాటల్లోనే తీసుకుంటే 80 శాతం పోలింగ్ జరుగుతుందని చెబుతున్నారు. అయితే పోలింగ్ స్టేషన్ల వద్ద  కనిపిస్తున్న సందడిని చూస్తూంటే మాత్రం పోలింగ్ భారీగానే జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 


ఈసారి పోలింగ్ 85 శాతం వరకూ జరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఎంత ఎక్కువ పోలింగ్ జరిగితే అంతగా మార్పునకు అవకాశం ఉంటుందన్నది ఓ కొలమానం, ఆ విధంగా చూసుకున్నపుడు ఏపీలో ఓటర్ల స్పందన చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఇది ఓ చారిత్రాత్మమైన మార్పునకు దారి తీసే అవకాశాలు స్పష్టంగా  ఉన్నాయని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: