హరీష్ రావ్ ఈ పేరు తెలియని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉండనే ఉండరు. ముఖ్యంగా తెలంగాణా గడప గడపకి కేసీఆర్ ఎంత పరిచయమో హరీష్ రావ్ కూడా అంతే పరిచయం.తెలంగాణా ఆవిర్భావం విషయంలో పోరుచేసిన కేసీఆర్ కి కొండంత అండగా నిలిచి కీలక పాత్ర పోషించాడు. ఆతరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హరీష్ కి నీటి పారుదల శాఖని అప్పగించడం, హరీష్ ఆ శాఖని సమర్ధవంతంగా నిర్వహించి తెలంగాణా వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం, తద్వారా కేసీఆర్ కి హరీష్ భవిష్యత్తులో ప్రత్యామ్నాయం అవుతాడని అందరూ గుసగుసలాడటంతో కేసీఆర్ హరీష్ పై ఓ శీతకన్ను వేసి ఉంచాడు.

 Image result for kcr harish rao

సహజంగానే చాలా విషయాల్లో కేసీఆర్ కి ఎన్నో అనుమానాలు ఉంటాయని అంటారు. అందుకే తన మేనల్లుడు వేసే ప్రతీ అడుగుకి సంభందించి అన్ని ఆధారాలు తెచ్చుకుంటూ జాగ్రత్త పడుతుంతారనే టాక్ కూడా ఉంది. అయితే కేసీఆర్ తన మేనల్లుడికి మంచి పదవి అప్పగించేందుకుగాను ఆయన్ని మంత్రి వర్గంలోకి తీసుకోకుండా ఉన్నారని. అందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని అంటుంటారు టీఆర్ఎస్ నేతలు. తాజాగా హరీష్ రావు వ్యవహరించిన దూకుడు తెలంగాణలో ఎంతో ఆసక్తిగా మారింది.

 

తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల మీద సమీక్షలు నిర్వహించారు హరీష్ రావ్. ఆ సమయంలో హరీష్ కనబరిచిన తీరు ఎంతో హాట్ టాపిక్ అయ్యింది. తాను ప్రాతినిధ్యం వహించే సిద్ధిపేట ఇరిగేషన్ అధికారులని ఆయన పిలిపించుకుని రంగనాయక,  అనంతగిరి రిజర్వాయర్ పనులపై సమీక్ష సమావేశం అప్పటికప్పుడు నిర్వహించారు. రంగనాయక సాగర్ కింద టన్నెల్ లో మిగిలిన 110 మీటర్ల లైనింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

 Related image

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఈ సమీక్ష సమావేశాలు అన్నీ కేసీఆర్ కి చెప్పే హరీష్ చేస్తున్నాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఆ శాఖపై ఉన్న పట్టుని ఇప్పుడు హరీష్ కొనసాగిస్తున్నాడా ఇదంతా కేసీఆర్ కి తెలిసే జరుగుతోందా అంటూ చెవులు కొరుక్కుంటున్నారట ఇరిగేషన్ అధికారులు. మరి ఈ విషయంపై కేసీఆర్ నుంచీ ఎలాంటి స్పందన వ్యక్తం అవుతుందో వేచి చూడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: